అంతరంగ మథనం
మనసు కడలిలో ఎగిసి పడే నా మౌన భావాల కెరటాలు
నిశిలో హటాత్తుగా
కమ్ముకున్న వలయాలు.
అర్ధరాత్రి కన్నీళ్లను తుడిచే
వీలులేని స్నేహితులు!
నేనున్నానంటూ తడిమి చూసే
నా కళ్ళ నీళ్లు..
నా భావోద్వేగాలను కట్టడి చేసే
జలతారు పుష్పాలు..
నా అంతరంగం.. కొన్ని వేల
పాలపుంతల సమూహం!
నాలో ఈ అంతర్మధనం
కనిపించదు మీకు ఇది నిజం!
నా అంతరంగం నా ఆత్మ సంభాషణం
నా భావోద్వేగం నా మనసుకు
సమాధానం!
– గాయత్రీభాస్కర్