అంతర్జాల ప్రతిభ
ఈ రోజుల్లో అన్నం తినకుండా నైనా ఒకరోజు బ్రతుకుతున్నారేమో గానీ అంతర్జాలం లేకుండా బ్రతకలేకపోతున్నారు.. అంతగా అలవాటు పడి పోయారు ఆ మహమ్మారికి అదీ చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు..
ఫోన్ ఇవ్వందే తిననంటాడు అక్షయ్! ఫోన్ లేందే హోం వర్క్ రాయనంటుంది శివాని ఇలా ప్రతి చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకూ ఇదే జబ్బు అంటుకుంది.. మరి దాంట్లో ఎన్ని విధ్యలో? అలవాటు పడకుండా ఎలా ఉంటారు? అన్ని విధ్యలూ అందరితో చేయిస్తుందీ అంతర్జాలం..
కొందరేమో రాతలు రాస్తే మరి కొందరేమో పాటలు పాడుతూ ఇంకొందరేమో వంటలు చేస్తూ అసలు కళలు అరవై నాలుగుంటే ఇందులో వాటి కన్నా ఎక్కువే చూపించేలా తయారైంది.. మరి అలవాటెందుకు కాకుండా ఉంటుంది??
ఆ అలవాటులో ఎవరి ప్రతిభ వాళ్లు కనబరుస్తున్నారు
మాధురి కూడా అలాగే నేర్చుకుంది మాధురీ నువ్వు చదువు మీద పెట్టమ్మా! నీ ధ్యాస.. ఆ పిచ్చి ఫోనేంటి? దాంతో నీ పిచ్చి వేశాలేంటి? అని ఎప్పుడూ తిడుతూనే ఉండేది వాళ్ల అమ్మ.. ఏ…పోమ్మా! అంటుండేది మాధురి.. ఆమె ప్రయివేట్ స్కూల్లో చిన్న క్లాసులకి చెప్పే టీచరు ఆవిడ భయం ఆవిడకు.. ఒకరోజు వాళ్లింటి దగ్గరికంతా మీడియా వాళ్లు వచ్చారు ఏమైందో! ఏంటోనని భయపడుతూ పరుగున వచ్చింది ప్రియ..
మీ అమ్మాయి ఎంతో మంచి వీడియో లు చేసి అవార్డు గెలుచుకుంది.. అందుకే ఆవిడ తో అందరం ఇంటర్యూ తీసుకోవాలని వచ్చాం! నిజంగా అధ్బుతమైన అమ్మాయిని కన్నారు మీరు మీ జన్మ ధన్యమైంది అని పొగిడే సరికి ఆవిడ ఆనందం చెప్పతరం కాలేదు..
పిచ్చి పనులు పిచ్చి చేష్టలు అనుకున్నా తెలియక నా బిడ్డలో ఇంత ప్రతిభ దాగుందా? అనుకుంది.. ఎవరిలో ఏ ప్రతిభ దాక్కుంటుందో కనుక్కుని ప్రోత్సహించడం మంచిది..
– ఉమాదేవి ఎర్రం