అంటరాని సిద్దాంతాలను
కులం లేదు మతం లేదు
మనుషులుగా పుట్టిన ఈ లోకంలో
కులమొక కాఠిణ్యాలను కట్టిన కట్టెల
మోపులని…మతమెక మాలిణ్యాలను
పులుముకొన్న రంగుల వలయమని….
తెలిసిన నిజాన్ని నిరుత్సాహ పరుచకు…
మతాల మారణహోమాలు మనుషుల
మానవత్వాన్ని రక్షించలేవు… కులాల
కట్టుబాట్లు కవనపు నీతులుగా పూటన
శ్రమించిన వాదాన్ని నడిపించదు…దేశం
ఒక మూల మార్మికమని నీతిలేని శాసనాలను
పూటగా పూయించుకోకు…
ఎవరి పూచీకత్తు నిర్దారణ చేసింది…
ఏధార్మికత తానై నిలిపింది తెలియని
వైషమ్యాలతో అడుగుబారిన అలుపు
నినాదాలతో ఒరిగిన సంధ్యల ఘాతకాన్ని
మా బతుకుల చీకటి మొగ్గగా
చిదిమేస్తున్నారు…
నగిన నాప చేలపై విరుచుకు పడకా
నాణ్యత నేర్పిన నాగరికథ మాకు
సందేశమై నడిపించిన సాగుబడిలో తడిచిన
చెమటలను దాహంగా తాగుతు…కల్పన
గావించిన రూపం దాల్చని అనురాగాన్ని
అర్పన చేస్తు కాలే కడుపు మంటలను కర్షక శ్రామికవాదంగా లోకానికి చూపక…
సంఘం చేయని వారిగా కాలాన్ని
అనుసరిస్తన్నాము…
ఏ కులమై ముందుకు నడిపిస్తుంది…
కలాలు రాయని మా భవ్యచరిత్రలను
ఏ మతమై ఆక్షేపిస్తుంది సాగర మథనం
లాంటి సంక్షేమ పథకాలను…అడగలేని
అడుగు తెలియని బరువై గుర్తించని చీకటితో
తీర్మాణాలు తిరస్కార భావాలు
అవుతున్నాయి…కులాల కుయుక్తులను
మతాల మరణ శాసణాలను కులమతాల
రక్కసిగా తెగనరికి…పేర్చిన చితిపై అంటరాని
సిద్దాంతాలను కాల్చిబూడిద చేయి…
-దేరంగుల భైరవ