అన్నం – వృధా?
అన్నం తినేటప్పుడు బ్రహ్మార్పణం
అంటాం.మనం తినగా మిగిలిన అన్నాన్ని
బయట అడుక్కొనే వాళ్ళకెవరికన్నా
పెడతాం.వాళ్ళకి ప్రాప్తం అనుకొంటాం.
ఇంకా మిగిలితే జంతువులకు పెడతాం.
కృష్ణార్పణం అంటాం. మిగతాది పారేస్తాం
వృధా అంటాం.దానిని చీమలు
మొ:కీటకాలు తింటాయి. అది కూడా
కృష్ణార్పణమేగా!రోగాలు రాకుండా, చెత్త
కాల్చేస్తాం. అగ్నికి అర్పణం అంటాం.
వంటలు చేసేటప్పుడు అంచనాలు
వేస్తాము.ఎక్కువ తక్కువలు ఔతాయి.
అనుకున్నంత మంది రాకపోతే
మిగిలిపోతుది.ఇది సహజం. ఎవరూ
కావాలని చెయ్యరుగదా! పైగా బ్రహ్మకి
కృష్ణునికి,అగ్నికి అర్పించింది వృధా
అయినట్టు కాదుకదా!,అని అనుకొంటే ఏ
విచారముఉండదుగదా!అని నా
అభిప్రాయం
****
– రమణ బొమ్మకంటి