అన్నా చెల్లెలు రుచి
ఒక అమ్మ గర్భంలో పుట్టకపోయినా
నేను కూడా ప్రాణం పోసుకున్నందుకేమో….
అమ్మను మరిపించే ప్రేమను నాలోకి జీవనదివై ఒంపుతూనే ఉంటావు..
నడకలోని తడబాట్లు నన్నంటకుండా …
మరో నాన్నవై నడిపిస్తూ ఉంటావు….
నన్నో వెన్నెలగా వెలిగించడానికి
నిరంతరం వేయి సూర్యులను దిగమింగుతూనే ఉంటావు….
నువ్విచ్చే అండ ముందు
ఈ లోకంలో ఎందరెందరున్నా దండగే….నాకు
ఒక్క గర్భంలో పెరగకపోయినా….
ఒక్క కంచంలో తిని…
ఒకరి కన్నీళ్లొకరం తాగినోళ్ళం….కదా
అన్నా చెల్లెలు అనే పదం రోజు రోజుకు మరింత రుచిగా ….అంతు’చిక్కని’ పిలుపుగా మారుతుంది….
ఆ చిక్కని రుచే… మనిద్దరి మధ్య రక్షణ కవచమై నిలిచినందుకేమో…
-గురువర్ధన్ రెడ్డి