అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ

అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ

నాకు చిన్నప్పుడే తల్లి, తండ్రి చనిపోయారు . అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆడపిల్లకు తల్లి లేకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని నాకు తెలుసు. అమ్మ లేకపోతే ఆడపిల్ల కనీస అవసరాలు చూసే దిక్కు ఉండదు. కానీ మా అన్నయ్య నాకు అమ్మ లేని లోటు తెలియకుండా చూసుకున్నాడు.

నాకు ఎలాంటి అవసరాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా , అమ్మ కన్నా ఎక్కువ నాకు చెప్పేవాడు , అంతకన్నా ప్రేమగా చూసుకునేవాడు. అన్నయ్య కు నేను ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టేదాన్ని.

కానీ అది బయట నుండి తేకుండా నాకు నచ్చిన విధంగా తయారు చేసి కట్టేదాన్ని. అన్నయ్య ప్రతి సంవత్సరం నేను కట్టిన రాఖీ ని జాగ్రత్తగా దాచుకునే వాడు.  ఒక బాక్స్ లో పెట్టీ అది నాకు సంతోషాన్ని ఇచ్చేది. నేను రజస్వల అయినప్పుడు అన్న చేసిన హడావుడి అంతా , ఇంతా కాదు, అన్న హడావుడి చూసి చుట్టుప్రక్కల వాళ్ళు  ఏంటయ్యా ప్రపంచం లో నీకే చెల్లె ఉన్నట్టు చేస్తున్నావు అంటూ వేళాకోళం ఆడారు.

అంతటి హడావుడి చేసిన అన్నయ్య, నన్ను ప్రేమగా పెంచిన అన్నయ్య, తల్లి ప్రేమను మరిపించిన నా అన్నయ్య , ఈ రోజు నేను అనేదాన్ని ఒకదాన్ని లేనట్టుగా, నాతో అసలేమీ సంబంధం లేదనట్టుగా , నేనెవరో తెలియనట్టు గా ప్రవర్తిస్తూ, కళ్ళ ముందే తిరుగుతున్నా , కూడా కనీసం చిరునవ్వు కూడా నవ్వకుండా ఉంటూ , చూస్తూ కూడా మాట్లాడడం లేదు.

నా చేతి రాఖీ కట్టించుకోడమే మహా పాపం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీనంతటికీ కారణం కూడా నేనే ఎందుకంటే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పు.. ఆ రోజు నేను వినయ్ గురించి చెప్పినప్పుడు అన్నయ్య షాక్ అయ్యాడు.అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ

వద్దు ఈ పెళ్లి జరగదు అన్నాడు కారణం ఏంటి అని అడిగితే తన స్నేహితుడికి ఇచ్చి చేస్తాను . అని మాట ఇచ్చిన విషయం చెప్పాడు. కానీ అన్నయ్య ఆ మాట తన స్నేహితుడికి ఇవ్వక ముందే నేను వినయ్ కి మనసు ఇచ్చాను. అన్నయ్య ఒప్పుకుంటాడు అనే నమ్మకం తో ఉన్న నాకు అన్నయ్య మాటలు , ప్రవర్తన అన్నివింతగాను , విచిత్రంగా అనిపించాయి.

ఇన్ని రోజులు నన్నెంతో ప్రేమించిన నా అన్నయ్య నా ప్రేమ మాట చెప్పగానే నన్ను ఒక పురుగులా చూస్తూ, నన్నొక అంటరాని దానిలా భావిస్తూ, పరాయి వాళ్ళు నా ఇంట్లో ఉండే అవసరం లేదంటూ నానా మాటలు అన్నాడు. అన్నయ్య ఇలా అంటాడు అని అనుకొని నేను ఆ మాటలు తట్టుకోలేక పోయాను . వినయ్ హరిజనుడే అయినా వినయవంతుడు.

అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ
అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ

మా అన్నయ్య అంటే తనకు చాలా గౌరవం, ఇష్టం కూడా  ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తాను అనుకున్నాడు . కానీ అన్నయ్య మాటలు విన్న నాకు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలువలేక అదే ఊర్లో ఉన్న వినయ్ ఇంటికి వచ్చేసాను. కనీసం వచ్చే ముందు ఆగమ్మ అని కూడా అనలేదు. వెళ్ళడమే మహా భాగ్యం అన్నట్టుగా చిత్తరువు లా నిలబడ్డాడు తల్లి తండ్రి అయి పెంచిన అన్నయ్య నన్ను చిన్న చూపు చూడడం తట్టుకోలేక పోయాను.

వినయ్ ఆ రాత్రి నన్ను చూసి కంగారు పడితే జరిగిన విషయం చెప్పాను. దానికి వినయ్ పద మాట్లాడతా అంటూ నన్ను తిరిగి ఇంటికి తీసుకు వెళ్ళినప్పుడు.. అంత దూరం లో మమల్ని చూసి బయటకు వచ్చిన అన్నయ్య వినయ్ ని, నన్ను చాలా మాటలు అన్నాడు . నీకు కృతజ్ఞత లేదన్నాడు,కులం చెడిన దాన్ని అన్నాడు, పరువు గంగలో కలిపారు అన్నాడు, ఇన్ని రోజులూ పాముకు పాలు పోసి పెంచిన అన్నాడు. ఎన్నో మాటలు అన్నాడు . అయినా నేను బాధ పడలేదు.

కానీ నా కారణంగా వినయ్ చాలా మాటలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా కులం గురించి అనేసరికి నాకు కోపం వచ్చింది. దాంతో అక్కడి నుండి వెళ్దాం పద అంటూ వినయ్ నీ తీసుకుని వస్తున్నప్పుడు నువ్వు నా దృష్టిలో చచ్చినట్టు అంటూ అన్నయ్య నీళ్ళు వదలడం చూసి గుండె పగిలింది.

ఆ తర్వాత వినయ్ నన్ను ఓదార్చాడు గుడిలో పెళ్లి చేసుకున్నాం, కొన్నాళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు . కాలం గడిచినా తర్వాత అన్నయ్య కోపం తగ్గుతుంది అనుకున్నా , కనీసం పిల్లలను చూస్తే అయినా దగ్గర అవుతాడు అనుకున్నా , కానీ అన్నయ్య మనసు కరగనే లేదు. వినయ్ పెద్ద ఉద్యోగం, ఇల్లు బంగళాలు ఎన్ని ఉన్నా , అన్న లేని నా జీవితం శూన్యంగా అనిపిస్తుంది.

అన్నా నీ అనురాగం నేను మరవలేక పోతున్నా , ఈ సారి అయినా నన్ను క్షమిస్తావని , ఆదరిస్తావని అనుకుంటూ… నీ అనురాగం కోసం పరితపిస్తున్న నీ చెల్లెలు …

అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ

– శైలజ

0 Replies to “అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ”

  1. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పక క్షమిస్తారు మీ అన్నగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *