అన్నా అన్ని వేళలా నా రక్షణ నీదే…

అన్నా అన్ని వేళలా నా రక్షణ నీదే…

అమ్మలోని ‘అ’ ని నాన్నలోని ‘నా’ని కలిపి పంచుకున్న బంధం ‘అన్నా’

ఆ బంధం అనునిత్యం చెల్లికి రక్షణగా ఉండే ఒక కవచం అలాంటి ఈ రక్షాబంధన్.

సోదరీ సోదరుల అనుబంధానికి ఈ రోజు శిఖర గౌరవం ఇచ్చిన రోజు .

సోదరుడి రక్షణలో సోదరి రక్షణగా ఎప్పుడూ ఉంటానని నమ్మి కట్టే రక్షాబంధన్.

తెలియకుండా వచ్చే మనస్పర్ధలతోటి కాస్త ఎడంగా ఉన్నా !

ఈ రోజు కలిసిపోయి మనసు విప్పుకొని చిన్ననాటి ముచ్చటలన్నీ చెప్పుకొని మళ్లీ ఒకటై పోయే రోజు ..

జీవితాంతం కలిపివుంచే సోదరీ సోదరీల పవిత్రమైన బంధాన్ని జీవితాంతం సాక్షి ఈ రక్షాబంధన్

సోదరీ జీవితానికి నేను ఎప్పుడూ రక్షగా ఉంటాను అని మాట ఇచ్చేను ఈ రక్షా బంధన్ ..

ఎప్పుడూ నీకు మాట రానీయక నడుస్తాను నీ రక్షణలో అని సోదరి మాట ఇచ్చే రోజు ఈ రక్షాబంధన్ ….

– సత్యవతి ఆలపాటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *