అన్నా చెల్లెలి అనురాగం
ఒక అందమైన పల్లెటూరు అందులో ఒక కుటుంబం ఆ కుటుంబం చాలా మధ్య తరగతి కుటుంబం తండ్రి చిన్న ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు తల్లి మెషీన్ కుట్టి ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి చక్కగా చదువుకుంటుంది.
అబ్బాయి మాత్రం అల్లరి చిల్లరగా గాలికి తిరుగుతూ ఉంటాడు తండ్రి ఎన్నిసార్లు చెప్పినా ఆ కొడుకు వినడు అలా అల్లరి చిల్లరగా తిరిగే కొడుకుకి ఒక రోజు హఠాత్తుగా ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ లో తన తండ్రి ఇక లేరు అని తెలుసుకుని వెంటనే ఇంటికి వెళ్తాడు అక్కడ విగతజీవిగా పడి ఉన్న తన తండ్రిని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు.
అలా తను మెల్లగా మారి తను ఒక ఉద్యోగం సంపాదిస్తాడు తన కుటుంబానికి తనే దిక్కు అవుతాడు తన సంపాదించిన డబ్బులతో తన చెల్లిని తన తల్లి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.
– భరద్వాజ్