అంగీకరించలేని నిజం
నీ పుట్టుక కొందరికి శాపం
నీ పుట్టుక కొందరికి వరం
ఇక్కడ నీ పుట్టుక కంటే నీ మరణాన్ని కోరేవారు ఎందరో
తల్లి గర్భంలో నువ్వు ఉన్నావని తెలిసినప్పటి నుంచి
నీలాంటి మరో ఆడపిల్లకు జన్మనిస్తున్నావని తెలిసే వరకు కూడా
నీ మరణాన్ని కోరేవారు ఎందరో….
ఆడపిల్లకు జన్మనిస్తున్నావని భార్యలను వదిలేసి భర్తలు ఎందరో
కానీ ఆడపిల్ల పుట్టుకకు తటస్థంగా లేని భర్త X,Y క్రోమోజోములు కారణమని అంగీకరించేది ఎప్పుడో..
ఆడపిల్లకు పుట్టుకకు కారణమైన భర్తలను వదిలేసే భార్యలు లేరు కదా ఈ ప్రపంచంలో
చదువుకున్న వ్యక్తి అయినా
చదువు రాని వ్యక్తి అయిన
భార్యని శిక్షిస్తారు…
మహిళలను గౌరవిద్దాం…
మహిళలకు చేయూతనిద్దాం…
– జగదీష్ బాయికాడి