అంగడి బొమ్మ
బాల్యం లో బాల త్రిపుర సుందరీ గా
యవ్వనం లో కన్యక గా
ప్రౌడ లో అమ్మవారి రూపంగా
ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు
అలా పిలిచినప్పుడు అహ
నా జన్మ ధన్యం నేను ఏది అడిగినా ఇస్తారు
అనుకుంటారు. ఊహ లోకం లో
నక్షత్రాల తోటలో విహరిస్తూ
కమ్మని కలలు కoటూ, మంచి జీవితం
కోసం కష్టపడి చదువుతారు.
అంత చదువులు చదివినా
ఏదో ఒక దుర్ధినాన ఇష్టం లేకున్నా
సమాజం కోసం ఏదో ఒక
అయ్యా చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటారు
అక్కడ ఎంత మంచిగా ఉన్నా ఏవో వంకలు
బానిస బతుకు, ఇష్టలన్ని మారిపోతాయి
ఊహాలన్ని తలక్రిందులు అవుతాయి
భరించలేని బాధలన్నీ భరించాల్సి వస్తుంది
భరిస్తూ భరిస్తూ కలల సౌధాలన్నీ కూలిపోగా
జీవితం అంధకార బంధురమవుతుంది
చిరాకులు,పరాకులు, ఎదురయ్యావు అంటూ
చిదరింపుల మధ్య జీవితం నిస్తేజంగా, నిరాశా
నిస్పృహల మధ్య కాలంలో కలిసి పోవడమే
ఆడజన్మ జీవితం అంటేనే లైటు పురుగు లెక్క ..
తాను కాలిపోతూ అందరికీ వెలుగునిచ్చే
ఆరాధ్య దేవత కానీ దేవతను పూజించినట్లు
ఆడదాన్ని ఎవరూ పట్టించుకోరు.పూజించరు
ఆడదాన్ని ఆటబొమ్మగా మార్చి ఆడుకుంటారు..
జీవితమే లేని మనిషిగా కూడా గుర్తించని అంగడి బొమ్మ ….
-భవ్యచారు