అందరికి ఏటికోళ్ళు , మేలు సందే
డబ్బు ఉన్నవారైన, డబ్బు లేని వారైనా, ఎవరికైతె గుండ ధైర్యం తక్కువగా ఉంటుంటో అటువంటి వారే ఆత్మహత్య అనె త్రోవలోకి లాగబడతారు. అందుకే ఒక మనకు తెలుగులో ఒక నానుడి ఉంది “మొండి వాడు రాజు కంటే బలవంతుడు” అని, అనగా మనలో గుండె ధైర్యం లేకపోతే సింహాసనం ఎక్కించి, సైన్యాన్ని సమకూర్చిన మనమ్ నిబ్బరంగా లేకపోతే ఏమి చేయలేము, అదే మనలో గుండె నిబ్బరత ఉంటే ఎడారిలో సాగు చేయగలం.
ఐతే మరి పిల్లలకు ఇవన్ని ఎలా తెలియచేప్పాలి??? అంటే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పిల్లలు సీజిన్నపోయూడు నుండి నలుగురిలో పెరిగేవారు, మనకు అప్పట్లో గురుకులాలు ఉండేవి, అనగా పిల్లలు నాల్గురిలో కలిసి పెరిగేలా ఒరవడి ఉండేది. లోకం ఎప్పుడు మన పట్ల అయిన, ఇవ్వరి పట్ల అయిన ఒకటే తీరులో ఉంటుంది, ఈ ప్రపంచం ఇవ్వతి పట్ల ఆప్యాతను చూపదు, కఠినమ్గానే ఉంటుంది,
ఇప్పుడైనా అప్పుడైనా ఒలవు (లోకం) మారలేదు, మార్పు పిల్లలు పెరిగే తీరులో వచ్చింది. నేటి పిల్లలకు నొప్పి అనేది తెలీదు, ఒకప్పుడు ఎన్నో దూరలు నడిచి మరి రాష్ట్రపతులు అయ్యారు, కాని నేడు ఎన్ని సౌకర్యాలు ఇచ్చిన ఎవ్వరు రాష్ట్రపతులు కాదు కదా, వ్యసనాల పాలు కాకుండా కూడా ఉండలేకపోతున్నారు. ఇలాగె కనక సాగితే మున్ముందు, ఊపిరు పీల్చడం కూడా మానవ జాతికి కష్టమౌతుందేమో…
కావున పిల్లలు నల్గురిలో పెరిగాలి, చిన్న చిన్న మాటలకు కూడా చిన్నపోతున్నారు నేటి పిల్లలు. దేన్నైనా సరే ఎదుర్కొకలిగే సత్తాను తల్లి తండ్రుకు, గురువులు వాల్లలొ పెంచాలి, ఈనాడు చదువు అనే వ్యవస్థ కూడా పిల్లల లో మానవతా కోణాలు పోయి, డబ్బే పరమావధి అన్నట్లుగా తీర్చి దిద్దుతున్నాయి. ఎందుకు చదువుతున్నారో కూడా తెలియకుండానె డిగ్రీలు, పీజీలు అయిపోతున్నాయి, అల్
అప్పుడు వాళ్లు సమాజం లోకి వచ్చి ఒకేసారి ఒత్తిడిని ఎలా తట్టుకోగలరు???
నేడు బడులలొ చదివే చదువుకు, బయటకు వచ్చి చేసే పనికి ఎటువంటి సంబంధం ఉండట్లేదు, చివరకు వారు చేయాలనుకున్నది చేయలేక, చేస్తున్న దానిమీద మక్కువ లేక బలవంతంగా బ్రతుకుని లాగుతా ఒకానొక సమయం లో ఒత్తిడికి గురి అయ్యి ఆత్మ హత్య చేసుకోవాలి అనే ఆలోచనలోకి వెళ్తున్నారు.
కావున బ్రతుకు ఎలా నడుస్తున్న దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించ గలిగేలా అయిన ఉండగలగాలి లేదా, మనం ఉండాలనుకున్న తీరులో మన బ్రతుకు నడిచేలా చేసుకోగలిగే గుండె నిబ్బరాన్నైనా పెంచుకువాలి.
-శ్రీ గణేష్