అందని ద్రాక్షలుగా

అందని ద్రాక్షలుగా

 

స్వతంత్ర భారతమా….పేరుకే
నీవు దేశమా…పేదవాని చదువుల తల్లి
మోసే చిల్లుల జల్లెడను చూచి
సవతి తల్లిగా కారిపోతున్నది…చదువుల
అంకురార్పన అర్థం లేనిదిగా మూటగట్టిన
మా ప్రాథినిత్యాలకు ప్రతిఫలం కన్నీరై
మిగిలింది…

చదువుల నెంచిన లోకం ప్రయాణం…
మాకు కనిపించనిదై పగబట్టిన పాముగా
పేదవాని విద్యను కుబుసంగా విడిచేస్తు
చదువుకునే రోజులు పోయి చదువును కొనే
రోజులు దాపురించాయి…పేదవాని సహనం
ఉట్టికెగరనిదిగా లోకం నానుడి మా
గుండెలను గాయం చేస్తున్నది….

అనునిత్యం దారుణమై విద్యన్నది
వ్యాపారమై….దొంగలు పంచుకొనే
వాటాలుగా చేతులు తడుస్తు అధికారం దుర్వినియోగమై పోతున్నది మా విశ్వాసాన్ని బతికించుకోలేక విద్యా సంబరాలు
ఉరి కొయ్యల ఉగ్గుపాలు తాగుచున్నవి…

వాడ వాడన జ్ఞానజ్యోతి వెలుగుల
పూజితమై…ప్రాపంచికపు కారణాలకు
దారి చూపుతు కర్మయోగుడై…మర్మమెరిగిన
ద్యాన నిమగ్నతలో నిలిచిన అంబేత్కరుని
వాక్కులు సమీకరించు పోరాడు భోదించు
అనే అక్షర సత్యాలు పూరించని
శంఖారావంగా అడుగంటి పోతున్నది…

నమ్మకాలు విరిగిన రెక్కలై…
కరుడు గట్టిన ప్రామాణికాలతో పొద్దు పొడుపు
కాలేక…వేదికలవ్వని అడుగు భవితవ్యం
పగిలిన చిద్విలాసమై…నైతిక భావాలు
భాద్యతలు లేనివిగా పేదవాని
మనో వికాసాలు కూలిన శిథిలాలక్రింద
శరణార్థులై విద్యా విధానాలు అందని
ద్రాక్షలుగా పులుపెక్కి పోతున్నాయి…

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *