అందని అందలం

 అందని అందలం

గ్రామానికి సవితి మహా నగరం
జనులను ఆకర్షించే యంత్రం

అంతులేని అక్కరకు చూపిస్తుంది
వాస్తవానికి జీవితాన్ని చిదిమేస్తుంది

సౌలభ్యాలతో మనసును లాగే నగరం
బంగారు వర్ణంలో తళతళలాడుతూ ఊరించే నగరం
అడుగు పెడితేగాని తెలియదు దానిలోని అగాధం

పరిపరి విధాలా ప్రయోజనకరం మహానగరం
కానీ పట్టెడు మెతుకులకోసం పడే కష్టం అనంతం

మనసుకు ఆనందాలను పంచె బహుళ అంతస్తుల ఆకాశ హర్మ్యాలు
తేరిపారా చూడలేని అశక్తతను వ్యక్తం చేసే లోచనలు

కాంతులీనే అనంతమైన అఖండ దీపాల సొగసులు
హృది దీపాన్ని వెలిగించలేని అపరిమిత కస్టాలు

ఎటుచూసినా కాలు కడపలేనంత రద్దీ
కదలలేక, గడపలేక జీవుడు బంధీ

అనంతమైన అవకాశాలలో ముట్టేది స్వల్పం
స్వార్ధానికే అక్కడ అందలం

మనిషిని మనిషిగా గుర్తించలేని నగరం
డబ్బు దస్కం ఉన్నవారిదే రాజ్యం

పొట్ట చేతబట్టుకుని వచ్చిన వారికి అవమానం
ఊబిలోనుంచి బయటకు రాలేక కొట్టుమిట్టాడే జీవనం

ఇదీ ఈ మహానగరం
చెప్పుకునేందుకు అందరి నగరం
కానీ అది కొందరికే సొంతం

 

-గంగాధర్ కొల్లేపర

0 Replies to “అందని అందలం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *