అందమైన లోకమనీ
అందమైన లోకమనీ.
రంగు రంగులుంటాయని.
అందరూ అంటుంటారు రామ రామ ..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా!
ఈ లోకం కుళ్లు నువ్వు చూడలేవు చిన్నమ్మా!
ఈ పాట సీమ హీరోయిన్ గా నటించిన తొలికోడి కూసింది సినిమా లోనిది..
చెల్లి గుడ్డి పాత్రలో సరిత చేసారు కళ్లు లేని తనకు కళ్లున్న అక్క లోకం గురించి చెప్పే పాట ఇది దీంట్లో అర్థమైతే చాలా బాగుంటుంది..
గడ్డి మేసి ఆవు పాలిస్తే అవి తాగిన మనిషేమెా విషమై పోతున్నాడని రచయిత చాలా బాగా రాసారు..
కె.బాలచందర్ డైరెక్టు చేసారు..
ఇది 1980 లో వచ్చింది..
మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్. ఎస్ విశ్వనాథన్ గారు .
.రాసిందేమెా ఆచార్య ఆత్రేయ గారు..
పాడింది ఎస్. జానకి గారు..
చూడని వాళ్లు సినిమా చూడండి పాట వినని వాళ్లు
వినండి చాలా బాగుంటుంది పాట కోసమైనా సినిమా
చూడండి..
-ఉమాదేవి ఎర్రం