అనగనగా ఓ చిన్న ప్రేమ కథ!!!
ఒక్క ఊరిలో ఒక అబ్బాయి,
ఆ అబ్బాయికి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే,
ఒక్క రోజు కూడా చూడకుండా ఉండలేనంత ప్రాణం.
కానీ అమ్మాయి కదా!
తన బాధ ,తన ప్రేమ అన్ని,తన కష్టాలు, ఇష్టాలు అన్ని తనలోనే ఉంచుకునీ
బయటకి ఎవ్వరికీ చెప్పుకోకుండా
చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి కోరుకుంది ఏది దొరకక పోవడం తో
ఇష్టపడింది అందలేని భావన లో
ఆ అమ్మాయికి ఇష్టం అయినవారు…
మధ్యలోనే దూరం అవ్వడం జరుగుతూనే ఉండడం తో
తన జీవితం తనకు నచ్చినట్టు ఒక్క క్షణం కూడా లేదు
చివరకి మంచి రోజులు వచ్చాయి అనుకునే లోపే …..
పాపం ఆ అమ్మాయి
ఆ విషయం తెలిసిన ఆయువు నిండిపోయింది అమ్మాయికి ఒక్కరోజే మిగిలి ఉంది….
అదే తనకి, ఆ అబ్బాయికి చివరి రోజు…
ఈ విషయం తెలియని అబ్బాయి…
చూసి చూసి…చివరకు తను ఇష్టపడ్డ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు ఆ అబ్బాయి…..
కానీ అమ్మాయి ఏమన్నదో తెల్సా??
రోజూ నన్ను చూడకుండా ఉండలేవు కద!
రేపు ఒక్కరోజు నన్ను చూడకుండా ఉండు, ఆ తర్వాత రోజు కలువు అనీ వెళ్ళిపోయింది.
ఒక్క రోజు గడిచిపోయింది….
మరుసటి రోజు ఆ అబ్బాయి, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళతాడు. అక్కడ ఏడుస్తూ, రోదిస్తూ ఇంటిలో మొత్తం జనమే,
కొంచెం లోపలికి వెళ్లి చూస్తే తను ప్రేమించిన అమ్మాయి ఫోటో ముందు దీపం…
అక్కడే బాధతో కుప్పకూలి పోయాడు ఆ అబ్బాయి…
చివరిగా ఆ అమ్మాయి రాసిన లెటర్ చదివాడు అబ్బాయి…
ఒక్కరోజు నన్ను చూడకుండా గడిపావు కదా!ఇక మిగితా రోజులు కూడా అలానే సంతోషంగా గడుపు …
ఆ చిరునవ్వులో నేను ఉంటా అంటూ తను సెలవు తీసుకుంటన్నాను!! అనీ రాసింది……
– భరద్వాజ్