అనాథ
అమ్మ ఆదిఅమ్మ ప్రేమ అనాది
కానీ ఆ ప్రేమ ఇపుడు అనాథ..
అమ్మ ప్రేమ మారిందా లేక కాలం తీరు మారిందా అని ఓ ఆలోచన చేస్తే….తూకం కాలం వైపుకే తూగింది…ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంటర్ నెట్ కాలం పిల్లలకి..
తల్లి అపుడు, ఇప్పుడు పడే నొప్పులు మారలేదు. కానీ కన్నాక పెంచే ప్రెక్రియ మారింది. అది తల్లి తప్పు కాదు కాలం తప్పు. అనేది నా ఆలోచన…ఇదివరకు అమ్మ వొచ్చి నిద్ర లేపేది, ఇప్పుడు మొబైల్ అలారం.. ఎందుకంటే అమ్మ కూడా ఆఫీస్ కి వెళ్ళే హడావిడి. ఇదివరకు అమ్మ అన్ని ఆరోగ్యకరమైన వంటలు చేసేది, ఇపుడు అంత సమయం లేదు. ఆగలేము రెండు నిమిషాల్లో అయ్యే మేగీ,ఇదివరకు అమ్మ చేయి పట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం. ఇపుడు లిఫ్ట్ వరకే అమ్మ, తరవాత రాకూడదు బస్ లో స్నేహితులు ఏడ్పిస్తారు.
ఇదివరకు సాయంత్రం పకోడిలో, బజ్జిలో, వేసి అమ్మ నాన్న తో పార్క్ కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మాల్ కి వెళ్లి అమ్మకి తెలియని ఆటలు ఆడుకుని అక్కడే ఎదో చెత్త తిని రావాలి.
ఇదివరకు అమ్మ పక్కనే పడుకునే స్వాతంత్రం, ఇపుడు చిల్డ్రన్ బెడ్రూం లో పడుకోడం గొప్ప. అప్పుడు అమ్మ అన్నిటికీ అవసరం. ఇపుడు చాలా బొమ్మలలో అమ్మ ఓ బొమ్మ
అప్పుడు అమ్మ ఒక ధైర్యం. ఇప్పుడు ఫోన్ ఏ ధైర్యం. అప్పుడు అమ్మ మాట వేదం. ఇపుడు గూగుల్ మాత దైవం. ఇలాంటివి ఎన్నో. ఇప్పటి తరానికి అమ్మ ప్రేమని దూరంగా పెడుతున్నాయి..
అమ్మ ఒడిలో ఒదగని, అమ్మ స్పర్శ తగలని, అమ్మ నీడలో ఎదగని, ఆ అమ్మ ప్రేమ పూర్తిగా పొందని బాల్యం పెరిగి పెద్దయితే. ఇకముందు చూడాల్సినవి, వినాల్సినవి, భరించాల్సినవి ఎన్నో…
-శ్రీ కిరణ్