అమృత ధార
అనంత విశ్వంలో అమృత ధార ఆధార భరితం
అమ్మ రుదిరాన్నే అమృత ధార గా పంచుతుంది
తల్లి అదరపు అమృత ధార సేవించి తేనే ఆరోగ్యానికి ఆయువు పట్టు
అలనాటి రాక్షసులు
హాలా హలాన్ని ఆరగిస్తే
దేవతలు అమృతాన్ని
అందుకునిమృత్యున్ జయులుగా వున్నారు
అదే సృష్టి రహస్యం
సాగర మథనం గరళం
అమృతంగా అవిష్కరిస్తే
రక్కసులకు గరలంగాను
దేవతలకు అమృతం గాను
అందుకే అపూర్వ భావనలతో ప్రేమ వాక్కుతో
అంతరంగ శుద్ధితో
వాత్సల్యాన్ని పంచినదే
అమృతధార
ప్రతి మనిషి ఓర్పుతో వొడిసి
పట్టిన అమృతాన్నిఆధునిక యుగంలో వెదికి వెదికి అనుభవించాలి
అందుకే
ఆలస్యం అమృతం విషం .
– జి జయ