అమ్మో ప్రేమ

అమ్మో ప్రేమ

ధరణి నీ ఆరేళ్లుగా ప్రేమిస్తున్నాడు వరుణ్ . తానెప్పుడూ ఒకే చెప్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే అయ్యింది.కానీ ధరణి వరుణ్ నీ గురించి, అతని బ్యాక్ గ్రౌండ్ గురించి అన్ని విధాలా తెలుసుకోవడానికి ఆరేళ్లు పట్టింది. తర్వాత తన ఇంట్లో వారిని ఒప్పించి, వరుణ్ తో పెళ్లికి ఒప్పించింది.
వాళ్లు కూడా ధరణి అన్ని తెలుసుకోవడం వల్ల ఒప్పుకున్నారు.ఒక సుముహర్తన వరుణ్ , ధరణి లా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

****
ఒక అందమైన అపార్ట్మెంట్ లో ధరణి,వరుణ్ ల కాపురం మొదలైంది.అప్పుడు మొదలయ్యాయి ధరణి కు భాధలు. వరుణ్ దరణిని కాలు కింద పెట్టనివ్వకుండ చూసుకునే వాడు. మొదట్లో ఇదంతా తొలి నాళ్లు అని సరిపెట్టుకుంది ధరణి.

ధరణి నోటు నుండి ఏదైనా మాట రావడం ఆలస్యం వెంటనే కళ్లముందు ప్రత్యేక్షమయ్యేది. ఆ చీర బాగుంది అనెలోపు వరుణ్ ఆర్డర్ పెట్టేసేవాడు.అబ్బా ఆ ఆహారం చాలా బాగుంది అనగానే మంచం పై నుంచి లేచే లోపు తన కళ్లముందు ఉండేది.

ఇలా తన నోటి నుండి రావడం ఆలస్యo క్షణాల్లో తెచ్చేవాడు వరుణ్.అసలు కాపురం మొదలు పెట్టినప్పటి నుండి వంటింటి లోకి వెళ్లనివ్వలేదు అన్ని తానే చేసేవాడు.ధరణి లేవగానే బ్రెష్ అందించడం, టిఫిన్ ,భోజనం వండి పెట్టడం ,బట్టలు ఉతకడం లాంటివి అన్ని చేసేవాడు. ధరణి కి మొదట్లో బాగానే అనిపించినా , రానూ రానూ విసుగు వచ్చింది.

అతను చేసి పెట్టిన వంటలతో తాను ఉన్న బరువు కన్నా ఎక్కువగా వెయిట్ పెరిగింది. కనీసం ఇంట్లో అటు ఇటు వాకింగ్ చేయాలన్నా కూడా చేయనిచ్చేవాడు కాదు తన కాళ్లు కందిపోతాయని వద్దని నువ్వు కింద నడవడం నాకు ఇష్టం లేదు అంటూ ఇల్లంతా దానిపై మెత్తని పరుపులు లాంటివి వేశాడు.

తనని ఇంత బాగా చూసుకోవడం బాగానే ఉన్నా కనీసం తన భర్తకు వండి పెట్టుకోవాలని కోరిక ఉంటుంది కదా కానీ తను పండిట్లోకి రానిచ్చేవాడు కాదు వంటింట్లోకి నువ్వు వస్తే నీకు ఎలర్జీ వస్తుంది నువ్వు ఆ వేడి నీ తట్టుకోలేవు, నీ అందం తరిగిపోతుంది అంటూ అసలు తనని ఏమీ ఇచ్చేవాడు కాదు.

********

అమ్మో వరుణ్ తనని ఇన్నాళ్లు ఇంతగా ప్రేమించాడా అయినా ఇదేంటి ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్లు భర్తగా వండి పెట్టడంలో సంతోషం పొందుతారు. కానీ ఇతను నన్ను ఏమీ చేయించడం లేదు. ఇంత ప్రేమ ఉందని తెలిస్తే ఎప్పుడో పెళ్లి చేసుకునేదాన్ని , ఇంత ప్రేమను భరించడం నావల్ల కాదు, అని మనసులో అనుకున్న ధరణి.  ధరణి పిలిచింది వరుణ్ బెడ్ రూమ్ లోకి , ఏంటి ధరణి ఏం కావాలి అంటూ వచ్చాడు వరుణ్ .

అప్పటికే సూట్కేస్ తో రెడీగా ఉన్న ధరణి అమ్మో వరుణ్ నేను ఇంత ప్రేమను భరించలేను. నన్ను వదిలేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక నీ జీవితంలోకి రాను ఇంత ప్రేమను భరించడం నావల్ల కాదు. అని వరుణ్ తో అనగానే ,అయ్యో ధరణి నేను నిన్ను ఎంత ప్రేమించాను. చూపించడానికి తప్ప నిన్ను బాధ పెట్టడానికి కాదు. నీకు ఇంతలా ఇష్టం లేకపోతే ఇకనుంచి నేను ఏమీ చేయను అన్నాడు.

అయినా సరే ధరణి వినకుండా పద్దు వరుణ్ అమ్మో నేను ఇంత ప్రేమనే భావించలేను. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను నన్ను ఆపొద్దు అంటూ సూట్కేస్ తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది.
**

పెళ్లి ఆరు నెలలు కాకుండానే కూతురు పుట్టేస్తోంది ఇంటికి రావడం పైగా అల్లుడు కూడా లేకపోవడంతో తరలి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది దాంతో ధరణిని అడిగారు ఏమైందమ్మా అంటూ ..

దానికి ధరణి ఏడుస్తూ అమ్మో అమ్మ వరుణ్ గురించి ఏమో అనుకున్నాను కానీ అతను నన్ను చాలా ప్రేమించాడు. అంత ప్రేమని నేను భరించలేను. నాకు విడాకులు కావాలమ్మా అంది ధరణి.

ఏంటి విడాకుల. నీకేమైనా సిగ్గుందా .పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే విడాకులు అంటున్నావు. అతనిని ఏమైనా కొట్టాడా ,తిట్టాడా , లేదా టార్చర్ పెట్టాడా ? ఇవన్నీ ఏమీ చేయలేదు కదా ,కేవలం తన ప్రేమను చూపించాడు. అది కూడా మీ అదృష్టం. అలాంటి భర్త దొరకడం నువ్వు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం.

ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకుంటే వాడు వరుణ్  ప్రేమించగలడా ? వాడు వరుణ్ ? నిన్ను చూసుకోగలడా ? పిచ్చిపిచ్చి వేషాలు మానేసి, హాయిగా కాపురం చేసుకో, అలాంటి భర్త దొరకడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ తల్లిదండ్రులు ధరణికి మైండ్ వాష్ చేయడంతో, నిజమే వరుణ్ లోని దేవుని చూశాను. అతని నేనే మార్చుకోవాలి మెల్లిగా అది కూడా ప్రేమగా, ఇప్పుడు విడాకులు తీసుకుని వేరే వాడిని చేసుకున్నా, వాడు తననే సరిగా చూసుకుంటాడు అని నమ్మకం లేదు, కాబట్టి నేను వరుణ్ దగ్గరికి వెళ్లడమే మంచిది అని అనుకుంటూ తను ఎలా వచ్చిందో అలాగే సూట్కేస్ తీసుకొని బయటకు వచ్చింది.

అక్కడ బయట వరుణ్ కారు తో సిద్ధంగా ఉన్నాడు. అతని చూసి ధరణి చాలా సంతోషించింది. మౌనంగా కారు ఎక్కింది.అత్తగారికి మామగారికి వీడుకోలు చెప్పిన వారు ధరణి తీసుకొని తన ఫ్లాట్ కి వెళ్ళాడు.

ధరణి చేంజ్ చేసుకోవడానికి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. ఇక అప్పుడే వరుణ్ , ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు ధరణి ఇదిగో నీ కోసం మిల్క్ షేక్ చేశాను తాగు అని అనగానే అమ్మబాబోయ్ నీ ప్రేమని ఎలా తట్టుకోవాలి రా అనుకుంటూ పరుగులు తీసింది ధరణి. అది ఆమె చేత తాగించడానికి వరుణ్  కూడా పరుగులు తీశాడు.

వారిద్దరి అన్యోన్యత చూసిన చంద్రుడు మబ్బుల చాటున దాక్కున్నారు.

 

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *