అమ్మే దైవం
కన్నతల్లి…
వెలకట్టలేని దైవం…
ఋణం తీర్చుకోలేని దైవస్వరూపిణి…
మానవతకు దైవస్వరూపం…
కరుణాకటాక్షములకు తిరుగులేని శక్తి స్వరూపిణి…
ఓర్పులో భూదేవి సమానురాలు…
పట్టుదలలో నిలువెత్తు శిఖరం…
హృదయం గర్భగుడి…
త్యాగానికీ పుటినిల్లు…
మమతానురాగాలకు అసలైన రూపం…
బిడ్డకు రక్షణ మొదటి ప్రాధాన్యం…
బిడ్డకు మాతృశాల…
బిడ్డకు అక్షరాలయం…
బిడ్డే ప్రాణంగా…
బిడ్డల గెలుపును…
బిడ్డల సంతోషమే…
తనకు ముఖ్యంగా భావిస్తూ…
బిడ్డల కోసం తన సర్వస్వాన్ని అర్పిస్తూ…
తన సంతోషాలను తన బిడ్డలలో చూసుకుంటూ…
తన గెలుపులను తన బిడ్డలలో చూసుకుంటూ…
బిడ్డలను కంటికీ రెప్పగా కాపాడుకుంటూ…
మురిసిపోతుంటుంది ”కన్నతల్లి”
అమ్మ నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ
– కన్నతల్లినే దైవంగా భావించే ఓ కుమారుడు(గోగుల నారాయణ)