అమ్మాయి అబ్బాయి

అమ్మాయి అబ్బాయి

శ్రీ కి ట్విట్టర్ అకౌంట్ ఉంది. తను సోషల్ మీడియా చాలా బాగా వాడుతుంది. ఎక్కువగా మంచి పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. అలా ఆమె మాటలకు చైత్యన వంతులు అయిన కొందరు ఆమెను అభిమానించడం ప్రారంభించారు.

అలా కొన్నాళ్ళు గడిచాక ఆమెకు ఒక సందేశం వచ్చింది. మీరు చాలా బాగా రాస్తున్నారు అని. ఆమె దానికి. ధన్యవాదాలు తెలిపింది.

అలా వారి పరిచయం పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళు పోయాక ఆ అబ్బాయి ఆమెను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. నా అభిప్రాయం నచ్చిన అమ్మాయి తో సహజీవనం చేస్తాను .

ఆమె ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఒక గది తీసుకుని ఆమెని వంట మనిషిగా పెట్టుకుంటాను అంటూ ఎన్నో మాటలు చెప్పాడు. నిజనికి ఆమె కు కూడా తోడు ఎవరు లేరు. ఇంట్లో వాళ్ళు ఉన్నా లేనట్టే కావడంతో పాటూ ఆమెకి కూడా తోడు కావాలి అనిపించింది.

దాంతో ఆ అమ్మాయి సరే అంది. అతను ఇల్లు వెతకడం మొదలు పెట్టడు. అలాగే ఆమెకి కొన్ని గిఫ్ట్ లు కూడా పంపడం మొదలు పెట్టాడు. అయితే అమ్మాయికి ఒక అనుమానం వచ్చింది.

మూడు నెలల పరిచయం లోనే పరిచయము, ప్రేమ, సహా జీవనం అంటూ మాటలు కలిపాడు. అతని గురించి ఆమెకు ఏమి తెలియదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని, సొంతూరు ఆంధ్ర అని మాత్రమే తెలుసు. అతని కుటుంబం గురించి ఏమీ తెలియదు.

ఆమె వార్తలు బాగా చూస్తుంది కాబట్టి ఇది లవ్ జిహాదీ నా అనే అనుమానం కలిగింది. కానీ ఇక్కడ ప్రేమ వల్ల ఆమె అతన్ని నమ్ముతుంది. కానీ అనుమానం మాత్రం అలాగే ఉంది. ఇక్కడ ఆ అమ్మాయి అతన్ని అతని ప్రేమను వదులుకోలేదు. ఆమె ఇంట్లో సమస్యల వల్ల అమేకొక తోడు కావాలి ఆమె బాధలు వినడానికి ఒక మనిషి కావాలి. ఆమె అతన్ని విడిచి ఉండలేనంతగా ప్రేమలో కురుకు పోయింది.

ఆమె చేసిన మొదటి తప్పు అదేనేమో, ఆమె నిత్యం వార్తలు చూస్తున్నా కూడా ఆమె అతన్ని నమ్మడం కేవలం ఆమెకు కావాల్సిన ప్రేమ దొరకక పోవడమే కారణం కావచ్చు. ఆమె అతన్ని పూర్తిగా నమ్మింది. కానీ ఇప్పటి వరకు వారిద్దరూ ఒక్క సారి కూడా కలవలేదు. కానీ ఫోన్ లో అప్పుడప్పుడు మాట్లాడుకున్నారు. అది కూడా కేవలం తిన్నావా, ఎం చేస్తున్నావు అంటూ తప్ప ఇంకేమి మాట్లాడలేదు.

ఇప్పుడు ఆమె అనుమానం నిజమే అయితే అతను ఆమెను ఏం చేస్తారో తెలియదు. ఒక వేళ అతనిది నిజమైన ప్రేమ అయితే ఒక మంచి ప్రేమికుడిని వదులుకుంటుందా ? అన్ని సమాధానం లేని ప్రశ్నలు.

ఇప్పుడా అమ్మాయి ఆ అబ్బాయిని నమ్మాలా వద్దా అనేది ఆమె ముందున్న ప్రశ్న? దీనికి సమాధానం ఎవరు చెప్తారు అంటే కాలమే సమాధానం చెప్పాలా లేక ఆమెనే తెలుసుకోవాలా ? మీరే చెప్పండి

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *