అమ్మతో స్నేహం
నా మొదటి స్నేహితురాలు అమ్మ
ఆమెతో నేను ప్రతీది పంచుకుంటూ
ఆమె నా అలకను తీరుస్తూ
నాకు ఆప్యాయంగా గోరుముద్దలు పెడుతూ
అన్నిట్లో తోడు ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ
నీ చల్లని చూపులతో మమ్మల్ని ఆదరిస్తూ
ఎవరితో ఎలా ఉండాలి అని చెప్తూ
నీ ముందు జాగ్రత్త నాకు శ్రీరామరక్ష అని అర్థం చేసుకుంటూ
నీకంటే గొప్పగా నా గురించి
ఎవరు ఆలోచిస్తారు అని అనుకుంటూ
నీ పక్కనే ఉండి నీ కన్నీళ్లు , బాధ అన్ని చూస్తూ
మళ్లీ నువ్వే ధైర్యం తెచ్చుకొని నాకు మార్గదర్శి అవుతున్నావు…
ఇంత కంటే గొప్ప స్నేహితురాలు నాకు ఇంకెవరు ఉంటారు…
ఏకాంతంగా కూర్చుని కార్చి కన్నీళ్ళకు నీ స్నేహం తోడైంది..
ఓ… నా నేస్తమా…
నీ స్నేహం నాకెంతో విలువైంది..
నువ్వు నాకు తోడు నీడగా ఉంటూ
నా కష్టసుఖాలను తెలుసుకుంటూ
నీ ఆత్మీయ పలకరింపుతో నన్ను
ప్రతిరోజు ఉత్సాహపరుస్తున్నావు…
నాకు స్నేహంగా ఉండే అమ్మ దొరకడం
నేను ఎంతో అదృష్టం చేసుకున్నావు…
అమ్మ నీ స్నేహంకి విలువ చెప్పలేనిది…
అమ్మ నీ బాధ్యతలకు విలువ కట్టలేనిది…
అమ్మతో ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను…
-మాధవి కాళ్ల