అమ్మ ఒడి
చిన్నోళ్ళు, పెద్దోళ్ళు
వయసు ఏదైనా మనసు కదిలితే వచ్చేది కళ్ళలో
కంటతడి….
బాధ ఏదైనా కంటతడి ఆరాలంటే చేరాల్సింది
అమ్మ ఒడి….
జ్ణానాన్ని ఇచ్చేది బడి
మనశ్శాంతి ఇచ్చేది గుడి
ఆ రెండింటి కన్నా గొప్పది
అమ్మ ఒడి…..
గంతిమర్రి అయినా
కల్లుమర్రి అయినా
ఊరు ఏదైనా మనకు హాయినిచ్చే నివాసం
అమ్మ ఒడి….
బానిసత్వం పిరికితనం అయితే….
అమ్మ ప్రేమలో బానిసత్వం కూడా గొప్పదే…ఆ ప్రేమకు దాసోహం కాని వారు ఎవరు….
మానవుడు అయినా
మాధవుడు అయినా
మాత కడుపున పుట్టాల్సిందే…..
విధి రాసే బ్రహ్మ అయినా
కథ రాసే రాం గోపాల్ వర్మ అయినా…
అమ్మ ప్రేమలో బానిసలు అవ్వాల్సిందే….
అమ్మకు ప్రేమతో…..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు…
-అశోక్
అమ్మ ప్రేమకు వెలకట్టలేం. అంత గొప్పది అమ్మ ప్రేమ.