అమ్మకోసం
అప్పుడు తన జీవితాన్ని మన కోసం త్యాగం చేసిన అమ్మ కోసం ఇప్పుడు కొంత సమయం
తప్పకుండా కేటాయించాలి.
అది మన కనీస బాధ్యత. మన చిన్నప్పుడు అమ్మ మనకోసం
చేసిన పనులన్నీ గుర్తుకు
వస్తే ఇప్పుడు కంట్లో కన్నీరు
ఉబికి వస్తుంది. ఏమేమి చేయలేదు ఆ తల్లి మనకోసం.
ఇప్పుడు ముసలివాళ్ళు అయిపోయి సరిగ్గా వినపడక,
కనపడక వాళ్ళు పడే అవస్థ
వర్ణనాతీతం. ఆ సమయంలో
ప్రతి రోజు కొంత సమయం
వారితో గడిపితే వారికది
ఎంతో సంతోషాన్ని కలిగించి
వారు ఆరోగ్యంగా ఉండేందుకు
కారణం అవుతుంది. మీతో
ఎక్కువ సమయం గడపాలని
వారు అనుకోవటంలో ఏమాత్రం తప్పులేదు. వారి
కోసం ఖచ్చితంగా కొంత సమయం వెచ్చించాలి.
తల్లికి తన పిల్లల కుటుంబ
సభ్యులతో కూడా గడపాలి
అని అనిపిస్తుంది. అదేమీ
గొంతెమ్మ కోరిక కాదు.
కుటుంబ సభ్యులు
ఆమెతో కొంత సమయం
గడపాలి. అమ్మ అస్తమించే
నక్షత్రం కాబట్టి ఎంత ఎక్కువ
సమయం వారితో గడిపితే
ఆ గడిపిన క్షణాలు మధుర
సృతులుగా మిగిలిపోతాయి.
అలా అమ్మ రుణం కొంతయినా తీర్చుకోవచ్చు.
-వెంకట భానుప్రసాద్ చలసాని