అమావాస్య రాత్రి
భయంకరమైన..
అమావాస్య రాత్రి..
చీకటి భయంకరంగా..
భయపెడుతుంది..
ఒంటరిగా ఒక్కదాన్నె..
నడుచుకుంటూ వెళ్తున్నా!
ఉమాదేవీ! అటు వెళ్లకు..
అంటున్నారెవరో..
నా మనసు వినడం లేదు..
చమటలు పడుతున్నాయి..
అయినా!
నడుస్తున్నా! నడుస్తున్నా!
హా….ఊబిలో ఇరుక్కున్నా!
పడిపోయా! ఊబిలో!
ఆ రాత్రి ఆ భయంకరమైన కల…
నిజమనుకున్నారా?
అది కలేనండోయ్!!
కలని తెలిసాక ఊపిరి పీల్చుకున్నా!!
-ఉమాదేవి ఎర్రం