అల్లరే అల్లరి
స్వేచ్చగా చేసే పనుల్లో అల్లరి
అబ్బుర పరచును
ఆనందాల కేరింతలు
అయినవారి వద్ద అవదులు
లేని చేష్టలు
మది పులకిరించును
అతిచమత్కారపుమాటలతో
ఉత్సహాల ఊపులతో
నేస్తాల చెంత సందడిగా
ఊహల రెక్కల మనసుతో ముచ్చట గొలిపే ఊసులతో
మునుగుతారు సంతోషంలో
హద్దులే తెలియని
వెటకారాల సరసాలు
వెలితి లేని నవ్వులు
సాగుతూ వుండే క్షణాలు
గలగల మనిపించే మాటలు
మురెపెపు మొహంతో
ముద్దుగొలిపే అనురాగాల
అందాల బంధాల లో
ఆస్వాదింపుల అల్లర్లు
సంతోషాల సరసన
కోపతాపాలకు తావులేక
కొంటెపనుల కోలాటం
చురుకైన చెలిమితో
అబ్బురపరచును హాయిగా
అల్లరితో వేసే చిందులు
కలతలులేక కలుపుగోలుగా
అల్లరి ఆకతాయిగాను
ఏ వయస్సులోనైనాఅల్లరితో
మటుమాయం ఆవేదన
అలసత్వం……..?
– జి జయ