అలంకారం
జీవితం ఎలా ఉంటుంది అంటే
అన్ని తానే అనుకుంటాం….
భూమి ఒక్క సారిగా అగి వెనక్కి వెళ్తే ఎంత అల్లకల్లోలం అవుతోంది అలా
జీవనశైలి,
ఆహారపు అలవాట్లు,
కొత్త అలవాట్లు,
దానికి తోడు భయం,
ఒంటరిగా కూర్చొని ఏడ్చే ఏడుపు
కొన్ని వర్ణించలేము…
ఊహల్లో తన కోసం కట్టిన కోటలో జ్ఞాపకాలు గూడు కడతాయి….
తన కోసం ఎదురు చూసే కళ్ళకి మబ్బులు కమ్ముకుంటాయి….
మరో తరం కోసం దాచిన రక్తమే నా ఇంటి గోడలకు అలంకారం అవుతాయి
మా పెళ్లి కోసం కొన్న పువ్వులే నా సమాధి అలంకారం అవుతాయి
మా పెళ్లి బాజలే నా చావు ముందు మేళాలు అవుతాయి
– సందీప్