అలలు
కడలి కెరటాల తరంగాలు
అలలై తీరం చేరాలని
ఎగసి పడుతుంటాయి
పున్నమి వెన్నెల రాత్రుల్లో
ఓలలాడు వొడిగిపోయి
సంద్రంలో
అమావాస్య అలజడిని
గాలి గర్షణలా బెదురు
చూపుతుంది
సుడిగాలి సుడిగుండాలు
కనుచూపుమేర
గర్జించి నా
ఎదురుచూసిన తీరాలు
ఎక్కడ అని చేరుకుంటాయి
జాలరికి జీవనాధారమై
జలం జలచరాల లో
సముద్రం అందిస్తుంటే
అలలలో తేలియాడే నావతో
నిత్యం సహజీవనం
ఆటుపోట్ల అంతుని చూసి
భయం లేక వేట సాగును
అదే మనిషి ధైర్యం మరి
సముద్రపు అలల తాకిడి
వచ్చి నీ పాదాలు తాకితే
అల శోభించును
మనసు ఉప్పొంగును
ఒడ్డు చేరిన అల కుదుపు ఆపి మళ్ళీ మొదలు పెడుతుంది మరి ఆలస్యం
కాకుండా……….
– జి జయ