అలా చేయక తప్పలేదు

అలా చేయక తప్పలేదు

వాసు చాలా మంచివాడు.అతని భార్య పేరు సునీత. ఆయనకు ఇద్దరు పిల్లలు.వాసు ఎప్పుడూ నవ్వుతూ,ఇతరులను నవ్విస్తూ ఉండేవాడు.

సునీతకు తన భర్తవాసు అంటే పిచ్చి ప్రేమ. వాసుపిల్లలకు కూడా వాసు అంటేఎంతో ప్రేమ. అలా వారంతాఎంతో ఆనందంగా ఉండేవారు.

పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకునిస్ధిర పడ్డారు. వాసు ఉండే ఊరిలోనే వాళ్ళుకూడా ఉంటున్నారు. అలా నవ్వుతూనవ్విస్తూ ఉండే వాసుకు ఒకరోజు కళ్ళుతిరిగాయి.

దాంతోసృహ తప్పాడు. మితృలంతాడాక్టర్ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు. డాక్టరు దగ్గరకు వెళితే ఆయన వాసుచెప్పిన విషయం విని కొన్నిటెస్టులు వ్రాసాడు.

వాసుకూడా టెస్టులన్నీ చేయించి,ఆ రిపోర్టులు తీసుకుని డాక్టరు దగ్గరకు వెళ్ళాడు. అవి చూసినడాక్టరు గారికి ఎందుకో అనుమానం వచ్చి మరిన్నిటెస్టులు వ్రాసారు.

ఆ వచ్చిన రిపోర్టులు చూసి వాసుకుకాన్సర్ అని తేల్చేసారు.జబ్బు బాగా ముదిరిందికాబట్టి తగ్గే అవకాశం లేదుఅని డాక్టర్ వాసు భార్యకుచెప్పాడు.

మానవ ప్రయత్నంచేద్దామని మంచి ట్రీట్మెంట్మొదలుపెట్టారు. వాసులోచాలా మార్పు వచ్చింది. ఇదివరకు నవ్వుతూ, నవ్విస్తూఉండే వాసు ఇప్పుడు భార్యా-పిల్లలను తిట్టడం మొదలుపెట్టాడు.

ఒకోరోజు భార్యనుకొట్టడం మొదలుపెట్టాడు.వారిని తన మాటలతో ప్రతిరోజూ ఏడిపించటంమొదలుపెట్టారు. వాసు అంటేనే వారు చిరాకుపడే స్ధాయికి వారిని తీసుకువచ్చాడు.

వాసు మితృడువాసుతో” నీకు నీ భార్య,పిల్లలు అంటే పిచ్చి ప్రేమకదా. వారికి కూడా నువ్వుఅంటే విపరీతమైన ప్రేమ.

మరి ఇప్పుడు వారితోఇంత దారుణంగా ప్రవర్తిస్తూఉన్నావు?” అన్నాడు. అప్పుడువాసు”నేను నా కుటుంబ సభ్యులను చాలా ప్రేమిస్తాను.

వారు కూడా నన్ను విపరీతంగాప్రేమిస్తారు. నేను ఎంతో కాలంబ్రతకను. నేను లేకపోతే నాభార్య జీవించలేదు. అందుకేనా మనసును చంపుకుని నేనువారితో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాను.

దాంతో వారికినాపై ప్రేమ పోయి ఏహ్యభావం వస్తుంది. నేను పోయినకొన్ని రోజులకు వారు నన్నుమరచిపోయి తమ జీవితాన్నిగడుపుతారు.

లేకపోతే నాపైప్రేమతో వారి జీవితాంతం నన్ను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటారు.అందుకే వారికి నాపై ఉన్నప్రేమను నేను ఇలా చంపేస్తున్నా.

తప్పనిసరిపరిస్ధితిలో ఇలా చేస్తున్నా.నువ్వు ఈ విషయం వారికిచెప్పవద్దు”అన్నాడు. కొన్నినాళ్ళకు వాసు చనిపోయాడు.

వాసు కుటుంబ సభ్యులుకొన్నాళ్ళు బాధపడి ఆ తర్వాతమామూలుగా తమ జీవితాన్నిగడపసాగారు. వాసు మితృడికివాసు మాటలు గుర్తొచ్చి ఒక నిట్టూర్పు విడిచాడు.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *