అక్షరం నా నేస్తం

అక్షరం నా నేస్తం

ప్రియమైన నీకు…

ఉదయం లేచిన దగ్గర్నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం , బంధువులను , స్నేహితులను ఏదో ఒక సందర్భంలో తలుచుకునే ఉంటాను. కానీ అందర్నీ ఈజీగా నమ్మడం అలవాటైపోయింది. నా చదువు తర్వాత బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ఇంట్లోనే ఉండిపోయాను.

ఒకటి మాత్రం నాలో ఉండేది. ఏది ఇతరులకు ధైర్యంగా చెప్పలేని తత్వం. అది మంచో చెడో  కూడా ఆలోచించే అంత బుర్ర ఉందో లేదో కూడా నాకే తెలియదు.

అలాంటి పరిస్థితిలో ఉన్న నేను నాలో ఉన్న భావాలను అక్షరతో పంచుకోవడం మొదలు పెట్టాను.  నేను ఇతరులకు చెప్పలేని ఎన్నో మాటలు ఈ అక్షరతో పంచుకున్నాను.

ఏంటో నా జీవితం అనుకున్నా తరుణంలో అక్షరతో కవితలు రాయడం మొదలు పెట్టాను.
చదువు  తర్వాత ఇంట్లో ఉన్న నాకు పుస్తకాలు , సండే పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం.
నా కుటుంబమే నా ప్రపంచం.

పాటలు పాడాలంటే భయం, ఎవరితో నేను ధైర్యంగా మాట్లాడాలి అంటే భయం , మనసులో మాట చెప్పాలి అంటే భయం ఇలా నాలో భయమే పెరిగేది కానీ ధైర్యం మాత్రం తక్కువ.అక్షరంతో చిన్న చిన్న కథలు కవితలు రాయడం మొదలు పెట్టాను.

అలాంటి నా ప్రపంచంలోకి భవ్య గారు నాకు పరిచయం అయ్యారు.ఆమెతో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నాకు రేపటి భవిష్యత్తు ఏంటో తెలియదు. అలాంటి టైంలో అక్షరలిపి గ్రూపులో చేరడం చిన్న చిన్నగా కవితలు రాయడం మొదలుపెట్టాను.

కాలం కదిలే కొద్దీ నాలో మార్పులు రావడం నాకే ఆశ్చర్యం కలిగింది. పాటలు అంటే అమితంగా ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఒక పాటలు పాడాలని , యాంకర్ మాట్లాడాలని చాలా కోరిక ఉండేది.

కానీ నా వాయిస్ బాగుండదు అని అపోహలో ఉన్నాను. అపోహ పోవడానికి చాలా కాలమే పట్టింది. కానీ ఇప్పుడు మాత్రం ఏది అనిపిస్తే అదే చేసేస్తున్నాను.  నేను చాలా ఎమోషనల్. మా అమ్మ నన్ను రెండు మాటలు తిడితే ఆ మాటలకి ఏడ్చే రకాన్ని.

ఒక కోపం మాత్రమే కాదు అన్నీ ఎమోషనల్ అక్షరంతో పంచుకునేటట్టు అలవాటు చేసుకున్నాను. అక్షరంతో ఇప్పుడు కలిసి నడుస్తున్నాను. తానే నా నేస్తమయ్యింది.

ఓ అక్షరమా నువ్వే నేస్తము
నా ప్రతి కష్టాన్ని నీతో పంచుకుంటూ
నేను ఒంటరిగా ఉన్న ప్రతిసారి ఈ అక్షరం నా తోడుంటే
తనతోనే నా ప్రయాణం సాగిస్తూ
నా రేపటి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాను..
ఈ అక్షరానికి నా లేఖ అంకితం చేస్తున్నాను.

 

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *