అక్షరం
అక్షరం అక్రయం సువ్యక్తమైతే సుఖాంతం
లక్షలకన్నా లక్షణమైనది లక్ష్మి సైతం మెచ్చినది
అనంతం ఆవిష్కరించు అంతరంగం
అన్నిటికన్నా అధికమైనది ఐనా అణుకువ నిండినది
తర తరాలకు వారికి తరగని పెన్నిధి
తీయ్యనైనా తిట్లే అయిన తీరు మాత్రం సున్నితం
చొరము కానిది చెడ్డ గుణం లేనిది
చిగురించినది స్పృశించిన మాత్రాన
చీకటి చీల్చే ఆయుధం వీడకు జీవితాంతం
-భరద్వాజ్