అక్షరం
అక్షరం మన జీవితంలో ఒక భాగం అయ్యింది.
అక్షరంతో నాలో అజ్ఞానాన్ని తెలుసుకున్నాను.
అక్షరంతో నాలో అభివృద్ధికి కారణం అయ్యింది.
అక్షరం తెలివితో ఎవరైనా ఎదిరించవచ్చు.
అక్షరంతో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకవచ్చు.
అక్షరంతో నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
అక్షరం ఆయుధం కన్నా గొప్పది.
ఆక్షరంతో ఎందరో జీవితంలో ఆత్మ విశ్వాసాన్ని నిప్పుతుంది.
కలంతో ఆవేదన, కోపం, సుఖం అన్ని వ్యక్తం చేస్తేదాన్ని.
కలమే ధిక్కార స్వరమై ప్రతిధ్వనిస్తుంది.
కవికి ఆవేశం ఒక సుగుణం.
ఉద్యమ కవికి మరింత ఆగ్రహావేశాలుండాలి.
అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.
మనసున్న ప్రతి మనిషికీ అవ్యాజమైన ప్రేమ, గౌరవం ఉంటుంది.
వ్యక్తి జీవితంలో మొదట నేర్చుకునే బాష మాతృబాష.
మాతృభూమి, స్వర్గం కంటే మిన్న అని తెలుస్తుంది. మాతృభాష సహజంగా అబ్బుతుంది, అప్రయత్నంగా వచ్చేదే మాతృభాష.
మాతృబాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభాసించడం సులభం.
మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు.
మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు.
మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి.
మాతృభాష మాధ్యమంవల్ల అధ్యయనం చురుకుగా సాగుతోంది.
సామాజిక స్పృహ పెంపొందుతుంది.
మాతృభాష మాధ్యమంలో విధ్యార్ధులకు అభ్యసనం క్రీడలా తోచి మానసిక శ్రమ, అలసట లేకుండా ఉల్లాసంగా వివిధ విషయాలను సులభంగా నేర్చుకొంటాడు.
మాతృభాషా మాధ్యమంలో చదవడంవల్ల ఆ భాషకు తగిన గౌరవం కల్పించినవారమవుతాం.
- మాధవి కాళ్ల