తెలుగుభాషను కాపాడుకుందాం తెలుగువారిని గౌరవిద్దాం
అక్షర లిపి అనేది ఒక సంస్థ కాదు. అక్షరలిపి అనేది ఒక కుటుంబం ఇందులో ఉన్న వారంతా కుటుంబ సభ్యులు.
ఇందులో ఉన్న వారంతా ఒకరికొకరు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ తప్పొప్పులను సరిదిద్దుతూ ముందుకు సాగుతూ కొత్తవారికి అవకాశాలను అందిస్తూ, పెద్దవారిని గౌరవించుకుంటూ, వారి సూచనలు కూడా తీసుకొని నిత్య విద్యార్థులమై ముందుకు సాగుచున్నది మన అక్షరలిపి.
అసలు అక్షర లిపి ఎలా మొదలైందంటే
అక్షరలిపి సంస్థ మూడేళ్ల క్రితం అనగా ఆగస్టు 15 2021లో స్థాపించబడింది. తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం ఎన్నో సంస్థలు సమూహాలు ఉన్నాయి.
కానీ అవన్నీ కేవలం అప్పటి మందమే కవులను ప్రోత్సహిస్తూ, తెలివిని ఉపయోగిస్తూ, తమ అవసరం తీర్చుకుంటున్నారు. తప్ప కవులను ఎవరు గుర్తించరు. అసలు కవికి పేరు అనేది ఉండదు.
నేను కవిని అని తనకు తాను చెప్పుకునే వరకు కూడా ఎవరూ అతన్ని గాని ఆవిడను కానీ కవి లాగా గుర్తించరు. ప్రతి సంస్థ అని చెప్పలేము.
కానీ కొన్ని సమస్యలు మాత్రం ఆర్థికంగా కూడా కవులను వాడుకోవడం కద్దు.
అయితే ఈ అక్షర లిపి సంస్థ ఏర్పడడానికి కారణం కూడా ఒక కవికి జరిగిన అవమానం, ఆ అవమానం వల్లనే అక్షరలిపి సంస్థ అధిపతి తనకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదని కవిని కవిలాగనే గుర్తించాలని.
కవి అంటే మామూలు వ్యక్తి కాదని. కవి అంటే సమాజాన్ని మార్చేవాడు అని తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసే వ్యక్తిగా గుర్తింపబడాలనే ఆకాంక్షతో అక్షరలిపి మొదలైంది.
గతంలో తమ రచనల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసిన ప్రముఖ కవుల గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం.
అలాగే అక్షరలిపి కవుల గురించి కూడా తరతరాలుగా చెప్పుకోవాలనే ఆకాంక్షతో, విలువైన మంచి సాహిత్యాన్ని పాఠకులకు అందించాలని ఏకైక లక్ష్యంతో అక్షరలిపి స్థాపించబడింది.
అక్షర లిపి ఇప్పటికీ దాదాపు 5వేల కథలను ప్రచురించడం జరిగింది.
మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా, వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేస్తున్నది.
అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్షర లిపి స్వార్థపూరితంగా కానీ, ఆర్థికంగా కానీ, ఎవరిని నుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థపూరితమైన రచనలు చేస్తూ, ప్రజలను చైతన్యం పరుస్తున్నది.
అక్షర లిపి సంస్థ లో చేరడానికి కావలసినదల్లా మంచి సాహిత్యం మాత్రమే.
అశ్లీలమైన ,అంగాంగ ప్రదర్శనలు చేసే కవితలు కాకుండా ప్రజలను ఉత్తేజపరుస్తూ ,ప్రముఖులను తలుచుకుంటూ రాసే కవితలే అక్షరలిపికి ఆయుధంగా మారుతున్నాయి.
మన అక్షర లిపి లో చాలామంది కవులు ఉన్నారు. వారందరూ చాలా గొప్పవారు. ఎన్నో మంచి కవితలు రాసినా కూడా వారికి గుర్తింపు అనేది రాలేదు.
ఇప్పుడు మన అక్షరలిపి సంస్థ ద్వారా ప్రతి రచయితకి తాను ఒక కవి నన్న విషయం గుర్తు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఏలాంటి ఆర్థికపరమైన ఫౌండర్స్ లేకుండా అక్షరలిపి ముందుకు సాగుతున్నది.
ఉన్న ,వచ్చే కవులకు కూడా ప్రవేశ రుసుము, కవితకు ఇంత పంపించాలి అనే విషయాలు ఏవి కూడా ఉండవు.
నిజాలను నిర్భయంగా రాసే వారికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సామాజిక, కుటుంబ ,ప్రేమ ,ఆప్యాయత అనురాగ కథలను, కవితలను ఎక్కువగా ప్రచురించడం జరుగుతుంది.
ఒక కవి ఎంతో కష్టపడి ఒక్కొక్క పదాన్ని ఏర్చి కూర్చి ఒక వాక్యంగా తయారు చేస్తాడు. అలా తయారు చేయడానికి వారి తెలివినంత ఉపయోగిస్తాడు.
అలా రాసిన కవిత లేదా అతను ఏదైనా సమూహానికి పంపినప్పుడు, వాళ్లు దానిని తీసుకోకుండా ఉండడం వలన ,ఆ కవి ఎంతో బాధపడతాడు.
అలాగని ఏది పడితే అది అక్షరలిపి ప్రచురించదు. అందులో నిజాలు ఎంత అనేది గుర్తించి మాత్రమే పబ్లిష్ చేస్తుంది.
ఒక కవి అవమాన పడడం అంటే ప్రపంచమే అవమాన పడినట్టు. ఉపాధ్యాయుడు సమాజానికి ఎలా ఉపయోగపడతాడో, కవి కూడా సమాజానికి అంతే ఉపయోగపడతాడు అనేది నిజం.
అక్షరలిపి ఆశయం ఒక్కటే ఇది ఒక సంస్థగా కాకుండా ఒక విస్తారమైన పత్రికగా,ఇది ఒక కుటుంబం లాగావిస్తరించాలని ఆ కుటుంబం విస్తరించడానికి గాను మన అక్షరలిపి కుటుంబం కృషి చేయాలని కోరుకుంటున్నాం.
ఇట్లు
-అక్షర లిపి కుటుంబం