అక్షర కళ
నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా మాతృ భాష పట్ల అపార ప్రేమ ఉంటుంది. రచనలు చేసే నేర్పు ఉంటుంది. అయితే మనిషి సమయాభావం వల్ల రచనలు
చేయడు. పైగా తన రచనలుఇతరులను అలరిస్తాయో లేదోఅనే సందేహంతో వారెప్పుడూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
నా వరకూ నేను నా నలభై ఐదవ పుట్టినరోజు నుండిరచనలు చేయటం మొదలుపెట్టాను. అంతకు ముందుఅంతర్లీనంగా వ్రాయాలనే తపన ఉండేది కానీ వ్రాసేసమయం ఉండేది కాదు.
నా నలభై ఐదవ ఏట కూడాసమయం లేకపోయినా వీలుచూసుకుని కధలు, కవితలువ్రాస్తూనే ఉన్నాను. నిజంగా
చెప్పాలంటే రచయితలకు ఏగుండెపోటు రాదు.
దానికి కారణం ఏమిటంటే మనసులోని భావాలను తనకధలు,కవితల ద్వారా బయటకు వెళ్ళగక్కేస్తాడు.అప్పుడు మనసులో భారంఉండదు. మనసు తేలికపడి
ఆరోగ్యం బాగుంటుంది.
అంతకు ముందు అంతర్లీనంగా ఉన్న నా లోని అక్షర కళ నానలభై ఏట నుండి ఇప్పటివరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.దానికి ప్రోత్సహించిన నాతోటి రచయితలకు, నాప్రియమైన పాఠకులకు నా ధన్యవాదాలు.
-వెంకట భానుప్రసాద్ చలసాని