అక్షర కల

అక్షర కల

అక్షరకు కొత్తగా టీచరు పోస్టు వచ్చింది అది రామడుగు
అనే పల్లెటూరు..
గవర్నమెంట్ జాబ్ ఎంతో కష్ట పడితే కానీ దొరకదు
పల్లెటూరని వెళ్లక పోతె తను కన్న కలలన్నీ వృధా అయిపోతాయి..
కనీసం ఒక్క స్టూడెంటునన్న మంచి మార్గంలో పెట్టి
దేశానికి భావి భారత పౌరుణ్ణి అందించాలని ఆమె కోరిక..
అది నెరవేరాలంటె ఆమె ఉధ్యోగంలో జాయిన్ కావలసిందే!
అసలు ఆ ఊరు ఎక్కడ? ఎన్ని కిలో మీటర్లు? ఎలా
వెళ్లాలి? ఇలాంటి వన్నీ తెలుసుకుని వచ్చింది..

ఆ ఊరికి వెళ్లాలంటె ఒకే ఒక ట్రైయిన్ ఉంది అంటే వేరే
ట్రైన్ లు ఉన్నాయి కానీ అక్కడ స్టాప్ లేదు అది సరిగ్గా
రాత్రి పదకొండింటికి చేరుతుందట..
అక్కడ దిగాక మళ్లీ ఏదయినా బండి దొరికితే దాంట్లో
వెళ్లచ్చు లేకపోతె మాత్రం నడిచే వెళ్లాలట..
అన్నీ తెలుసుకుని ప్రిపేర్ అయింది..
తనతో ఎవరూ వచ్చే పరిస్థితి లేదు ఒంటరిగానె వెళ్లాలి

ఒక సూట్ కేసు ఒక బ్యాగు తన లగేజి..
ఇక రైల్వే స్టేషనుకు వెళ్లి టికెట్ తీసుకుని ట్రైయిన్ కోసం వెయిట్ చేస్తుంది..
మన ట్రైన్ లు ఎప్పుడూ అనుకున్న టైంకి వచ్చి చచ్చాయి గనుక ఓ గంట లేట్ అయింది దాంతో గమ్య
స్థానం చేరేసరికి పన్నెండు అయింది..

**

అక్కడ ఉన్న స్టేషన్ మాష్టారును అడిగింది రామడుగు
ఎలా వెళ్లాలని..
అయ్యెా అమ్మా ట్రైన్ లేటు అవడంతో బండ్ల వాళ్లందరూ వెళ్లి పేయారు ఇక నడిచే వెళ్లాలి మీరు
భయపడక పోతె వెళ్లొచ్చమ్మా!
భయపడితే మాత్రం ఈ స్టేషనులోనె ఉండి ఉదయమే
వెళ్లండి అన్నాడు..
అక్కడ పడుకోవడం కన్నా ఊర్లోకి వెళ్లడమే బెటర్
అనుకుంది..
ఎందుకంటె నాన్న గారు అంతకు ముందే ఆ ఊరి సర్పంచ్ తో మాట్లాడి రూం అరేంజ్ చేసారు వెళ్లి పడుకుంటె మంచి నిద్ర అయి పొద్దున్నే స్కూల్లో జాయిన్ కావచ్చు అనుకుంది..
ఎటు నుండి వెళ్లాలో తెలుసుకుంది..
అంతా చిక్కటి చీకటి ఎందుకయినా మంచిది పల్లెటూరు కదాని టార్చి తెచ్చుకుంది వెంట అది తీసి ఆన్ చేసుకుంది..
టార్చ్ లైట్ వెలుతురులో నడుస్తుంది..
దూరంగా నక్కల అరుపులు ఊ…ఊ..అంంటూ కుక్కల
మెురుగులు వినిపిస్తున్నా ధైర్యంగా నడుస్తూనె ఉంది..
కొంత దూరం వెళ్లాక వెనుక ఏదో వస్తున్నట్టు అనిపించింది..
వెనుతిరిగి చూసింది..
తెల్లటి ఆకారం పై పైకి వస్తుంది..
ఎ…వ…రు? అంది భయపడుతూ..
అ…క్ష…ర…నేను నీ కోసం వచ్చా…అందాఆకారం..
ఏయ్!! ఏం కావాలి? ఎ..వ…రు..నువ్వు? అంది..
అ…క్ష…రా….రావే…రావే…అంటుందాకారం..
నా పేరు నీకెలా తె..లు…సు?
వణికిపోతూ…అక్షర…
వచ్చేసింది దగ్గరకు పైకి ..పైకి…
వద్దు…వద్దూ…నన్నేం చేయవద్దు..
కెవ్…కెవ్..
అరుస్తూనె ఉంది..
సావిత్రి వచ్చి లేపుతుంది..
అక్షరా! ఏంటే అరుస్తున్నావు? ఇవ్వాలే నువ్వు వెళ్లేది
లే! అంది..
మెలుకువ వచ్చి అమ్మెా! నేనింకా వెళ్ల లేదా? ఖచ్చితంగా ఎవరినయినా తోడు తీసుకుని వెళ్లాలి అనుకుంది..

 

-ఉమాదేవి ఎర్రం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *