ఆకాశం

ఆకాశం

 

ఆకాశం ఏనాటిదో..
నా మనసేమెా ఈనాటిదే..
ఏ బాధ కలిగినా ఆకాశంతో..
చెప్పుకుంటే ఓదార్పు లభించేది..
ఎందుకంటె..
ఆకాశం నా బాధ విని..
మనుషుల్లా వెక్కిరించదు..
దెప్పి పొడవదు…
ముఖ్యంగా నా చాటుగా..
ఎవరికీ చెప్పదు..
తన చల్లటి చూపులతో ..
నాకు ఓదార్పునిస్తుంది..
చల్లగా ఉండమని ఆశీర్వాదమిస్తుంది..
నేనున్నా నీ కని భరోసా నిస్తుంది..
నేను నీతోడంటుంది…
అందుకే…
ఆకాశం నా స్వంతమనిపిస్తుంది..

 

 -ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *