ఆకలి అంటే
ఆకలి అంటే నాకు చాలా ఇష్టం…
ఆకలి నాకు పరిపూర్ణత నేర్పింది…
ఆకలి నాకు మమతలు పంచడం నేర్పింది…
ఆకలి నాకు అందరిని దగ్గరగా చేసింది…
ఆకలి నాకు జ్ఞానాన్ని ఇచ్చింది…
ఆకలి నాకు అందరిలో దైవత్వాన్ని చూపింది…
ఆకలి అంటే నాకు చాలా ఇష్టం…
ఆకలి అంటే నాకెంతో గౌరవం…
ఎందుకంటే…!?
ఆకలి నాకు కొత్త ప్రపంచాన్ని చూపింది…
ఆకలి నన్ను అజేయున్ని చేసింది…
అందుకే ఆకలి అంటే నాకు మహ ఇష్టం…
– అంకుష్