ఆహా ఓహో

ఆహా ఓహో

మెడలో మూడు ముళ్ళు వేసి నీతో ఏడడుగులు నడిపించుకుని చేయి పట్టి
నీ ఇంటికి తీసుకువచ్చి
నీ తల్లికి అప్పజెప్పితివి ..!!
ఆమె తన పెత్తనంతో పాటు
తోడబుట్టిన వారి పెత్తనం కూడా చెలయించబట్టే..!!
ఏం మాట్లాడినా తప్పే తిన్నా తప్పే తినక పోయిన తప్పే పన్నా తప్పే కూర్చున్న తప్పే..!!
తప్పుల మీద తప్పులు పడుతూ కొట్టక తిడుతూ చిత్రహింసలు పెట్టబట్టే..!!
ఏనాడు పట్టించుకోకపోతివి
నా వైపు ఏ పొరపాటు లేదని తెలిసినా కూడా ఏనాడు ఓదార్చింది లేదు..!!
అటు అనలేక ఇటు అనలేక తప్పించుకుని తిరిగావే కానీ
ఆ బాధల నుండి తప్పించింది లేదు!!
ఇప్పటికప్పుడు మాట దాటేస్తూ అక్కర తీర్చుకున్నావే కానీ నాకు ఏమీ అక్కర అని చూసింది లేదు..!!
ఏమైనా చెప్పబోతే సంసారం అంటే ఇలాగే ఉంటుంది.
అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావ్.? ఇప్పటికైనా నచ్చకపోతే వెళ్ళిపో..! అని ఎదురు ప్రశ్నిస్తూ బెదిరించటం
నీ వాళ్ళ ముందు నిలదీయడం
అది చూసి వాళ్ళు ఆహా ఓహో అంటూ ఊరంతా చెప్పడం
ఎన్నో అవమానాలు పడుతూ
నన్ను చూడకపోయినా పరవాలేదు నా పిల్లలనైనా చూడాలని ఆశపడ్డాను.
అది లేదు నీ కన్న వాళ్ళ
పరాయి కన్నవాళ్లను ఎక్కువగా చూసావు
మా రాత ఇంతే..!!
మా బతుకులు ఇంతే..!!
అని సరి పెట్టుకున్నాను
తలకు మించిన భారం పెట్టుకుని ఎవరిని పట్టించుకోకపోతివి.!!
గాలికి పోయే గొడవ ఇంటిదాకా తీసుకొచ్చి
వాళ్ల మీది కోపం
నాపై పిల్లలపై తీస్తున్న
చేసేదేమీ లేక మింగలేక
కక్కలేక భరించుకుంటూ సహించుకుంటూ..
ఆడ బ్రతుకులు అంటేనే.! సర్దుకుపోవడం కావచ్చు అనుకొని సర్దుకుపోతుంటిని..!!

 

 

 

-బేతి మాధవి లత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *