అహా…. ఏమి ఈరోజు భారతిలో..
మన జెండా పండుగ..
ఆనందంతో యద నిండగ..
నాటి వీరుల త్యాగం ఫలింపంగ..
నేటి స్వేచ్ఛా జీవితం మనకు లభించంగ..
భావి యువతరం ఉర్రూతలూగంగ..
అసమానతలనేడివి రూపుమాపంగ..
జయహో భారతి అంటూ నినదించంగ..
ఇలకు చేరదా ఆ సమైక్యతపు గంగ..
జీవితం ధన్యమై జీవించంగ..
మరణించినను మనిషి గా బ్రతకంగ..
అందుకై అందరం ప్రమాణం చేయంగ..
అందుకే ఇది మనందరి పండుగ…..
ఇది తలవని గుండె.. ఉన్నా దండగ…
– కిరీటి పుత్ర రామకూరి