అహ నా పెళ్లంట

అహ నా పెళ్లంట

నాకు నచ్చిన సినిమాలంటె చాలానె ఉన్నాయి కానీ దాంట్లో మరీ మరీ ఇష్టమైన సినిమా అంటే “అహ నా పెళ్లంట” ఈ సినిమాలోకామెడీ చాలా ఇష్టం.. జీవితంలో అన్నీ కష్టాలే కదా! ఏడుపులు లేని జీవితాలు ఉండవేమో! ఆ అనుభవాల నుండి కాస్త రిలీఫ్ అవడానికి ఇలా నవ్వుకునే సినిమాలంటె చాలా ఇష్టం నాకు..

ఈ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ గారు హీరోయిన్ రజనీ గారు ఇక కోట శ్రీనివాస రావు గారు బ్రహ్మానందం గారైతే ఆ సినిమాకె హై లెట్.. దర్శకుడు జంధ్యాల గారు సంగీత దర్శకుడు పసుపులేటి రమేశ్ నాయుడు గారు.. నిజంగా సినిమా అంతా కూడా నవ్వించడం అంటే మామూలు మాట కాదు..

ఆ నవ్వులు ఎప్పటికీ మరిచి పోలేం! నాకైతే బాగా నచ్చిన సినిమా అది..

– ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *