అగ్నిశిఖ
“ఆమె” సృష్టికి మూలం – జీవానికి ఆధారం, పంచభూతాత్మక రూపం
జన్మకు కారణం – జీవిత సాఫల్య హేతువు “ఆమె”
తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి జన్మనిస్తుంది
ఆది గురువై ఓనమాలు నేర్పుతుంది “ఆమె” అమ్మగా.
ఆకాశానికి “అంచులు” వుండవు కొలవడానికి
“ఆమె” త్యాగానికి హద్దులుండవు వర్ణించడానికి
“వాయవు” లేని ప్రదేశం ఉండదు
నీ జీవితాన “ఆమె” ఊపిరులూదని క్షణం ఉండదు
అనునయంతో తన జీవితాన్ని దివిటీగా మార్చి దారి చూపుతుంది
ఆగ్రహిస్తే చండ ప్రచండమైన “అగ్ని” కణమై దహిస్తుంది
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అలుపెరగని నీ పోరాటం
ఆ సూర్యచంద్రులకు అసాధ్యం
విజయమే సోపానంగా సహనంగా ఆమె వేసే
ప్రతి అడుగు ఆదర్శనీయం అభినందనీయం
చలించని చిత్తంతో సమాజపు కెట్టు దృష్టిని
దునుమాడుతూ లక్ష్య సాధనలో దూసుకుపో
చరిత్రలో నీకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకో ….
గంగాధర్ కొల్లేపర