అగ్ని సాక్షిగా!!
చలి చీకట్ల ఆరాటం,
చెలిని కమ్మేసెను
అకాలమున.
పరవళ్ళు తొక్కుతున్న,
నదీమతల్లి ఒడిన
పసిబిడ్డ ఓలె చేరి,
ఆ తల్లి ప్రవాహాన్ని
చీర కొంగు గా మార్చి
జల,జలా కారుతున్న
కన్నీటిని తుడువజిక్కెను!!
నిశీధి చీకట్లను,
ఉవ్వెత్తున ఎగసిన,
చితి మంటలు చీల్చుతుండ,
కారు కన్నీరు ఆవిరై
కార కుండెను.
శాశ్వతంగా మూగబోయిన
ఆ గొంతుక,
అగ్ని సాక్షిగా చెప్పెను,
నిన్ను ఊరట చేయ
నేను ఉదయస్తాను
కిరణ్మయి నై.
నీకు సేద నిచ్చుట తధ్యము,
అవి నా
పలుకుల పసిడి మూటలు!!
– వాసు