అజ్ఞాతం
అజ్ఞాతంలో వెళ్లేది అవకాశాల కోసమే చిన్న విరామం మాత్రమే…
అజ్ఞాతమనే అంధకార చీకట్ల ముసురు బ్రతుకుల నుండి పాఠాలు నేర్చుకోవడం..
అజ్ఞాతం అనేది మౌనానికి ఒక ప్రతీక అది ఒక గంభీరం..
అజ్ఞాత వాసం చేసిన పాండవులు సహితం సంక్లిష్టమైన అది మహాభారత యుద్ధ విజయానికి అది ఒక ఉపకరణం..
అజ్ఞాతంలోకి పోవడమనేది మనశ్శాంతి..
అది మళ్లీ కొత్త శక్తిని క్రోడీకరించి బాహ్య ప్రపంచంలోకి కొత్త వెలుగులు ప్రసరింప చేయడానికి…
అజ్ఞాతం అనేది పిరికితనం కాదు.. పిడికిలిబిగించినడానికి.. కొంత సమయం తీసుకోవడమే దాని ముఖ్య ఉద్దేశం..
– పలుకూరి