ఆగకనే పాయే
ఈ వాన అగ్గిదలుగా ఈ వాన ఆగకనే పాయే
అటు పనులమ్ముకునేది పూల అమ్ముకునేటోళ్లు
ఉల్లిగడ్డలు అమ్ముకునేటోళ్లకు
దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు గా మారిపోయే ,
రోడ్లమీద దుకాణంలో పెట్టి ఆపారం చేసుకుని
కుటుంబం నడిపించుకునేటోల్ల బతుకు
బస్టాండ్ చేసే వాన, పాపం వల్ల బతుకులన్నీ ఆగం అయిపోయే
తింటందుకు గుక్కెడు గంజి లేక బతుకులన్నీ విలవిలలాడిపోయే
ఏటని పోతారు ఏమని చేస్తారు
ఫ్లాట్ ఫామ్ మీద పండుకునే బిచ్చగాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం
వేసుకొని బట్టలు లేవంటే కప్పుకోనికే బట్టలు లేకుంటే
ఇవాళ ఎంత ఆగమాగం అయిపోయాయి
ఏడతల దాచుకుంటారు ఏడ పంటారు,
ఇండ్లల్లో ఉన్నోళ్లు అన్నీ ఉన్నోళ్లు వాన
ఉడుకుడుకులు బజ్జీలు వేసుకుంటది తింటుంటే …
బతకడానికి పట్నం వచ్చి బిచ్చగాళ్ళుగా మారికూలీలు
పండ్లు పువ్వులు అమ్ముకునేటోళ్లు ఉల్లిగడ్డలు అమ్ముకునేటోళ్లు,
బిచ్చమెత్తుకునేటోళ్లు, ఆత్మాభిమానం అడ్డొచ్చి కారు తుడిచి పైసలు
అడుక్కునేవాళ్లు అందరూ ఆగామాయిపై ఈ వానాకిదలుగా
ఎప్పుడు ఆగుతదో ఏమో,, అలనోట్లకు నాలుగు మెతుకులు
ఎప్పుడు పోతాయో ఏమో, అన్నం మెతుకు చూసి ఎన్నాళ్లయిందో ఏమో
, అందరూ రైతులను పంటలను చూస్తారు కానీ ఇలాంటి వాళ్లను పట్టించుకునే నాధుడే లేక గతి లేక పోయే…
-భవ్యచారు
Meru cheppindhi correct akka.
Chala baga chepparu..