అధికులు
అణువు గాని చోట
అధికుల మన రాదని
నా ఇంట నేనుంటే..!!
ఇల్లు చుచ్చుకొని వచ్చి
కల్లెబోల్లె మాటలు
చెబుతూ మచ్చిక
చేసుకుని మంచితనాన్ని ఆసరాగా చేసుకుని చీటికిమాటికి వస్తూ
పొగుడుతూ వచ్చి
రోజుల తరబడి
గడుపుతూ ఎక్కడెక్కడో చుట్టరికపు అక్కరకు
రాని తెలియని గారడి మాటలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తూ…
అవసర నిమిత్తం కాలం
గడిపి వెళ్లిపోయి నా ఇంట జరిగే విషయాలు ఊరంతా చెబుతూ పబ్బం గడుపుతూ
పరులతో కలిసిపోయి వేలెత్తి చూపిస్తూ దెప్పిపొడుపు మాటలతో తూటాల్లాగా పొడుస్తూ ఉంటే..!
ఎద గాయాలు అయి
మానని మరకలుగా మిగిలిపోయే..!!
-బేతి మాధవి లత