అద్దె ఇల్లు
సొంత ఇల్లు కల అయితే
అద్దెఇల్లు ఆధారమే మరి
అవసరం అయినప్పుడు
అద్దె ఇల్లే అందాల మేడ
ఆంక్షలు ఎన్ని వున్నా అది
జీవనానికి నీడ
అభ్యంతరాలుఎక్కువేవున్నా
అక్కున చేర్చును అప్పటికి
అందులోనే ఉంటాయి
భాష గోల బాధ గోల
అన్నీ కలిపి భరించే గాథ
వచ్చే వారికి ఇచ్చే వారికి
నచ్చినా నచ్చకపోయినా
అదే ఇల్లు అండ
మనది కాదని మర్మమే
భాద్యతగా ఉండలేము
సౌకర్యాల సౌధం అయితే
అద్దెఇల్లు కూడా అద్భుతమే
యజమాని నస లేకుంటే
నివసించే వారికి లేదు ఢోకా
కలిసేవస్తే అద్దె ఇల్లుకుడా
ఆశల హద్దులకు పొదరిల్లే ?
– జి జయ