అడవులని రక్షించాలి
పంచ భూతలు అంటే ఆకాశం,
నేల,వాయువు,జలము,అగ్ని.
ఇప్పుడు ఆకాశంలోకి రసాయనిక వాయువులు
వదిలి వాయు కాలుష్యానికి
కారణం అవుతున్నాయి ఈ
రసాయనిక పరిశ్రమలు. ఈ
కాలుష్య భూతానికి ఈ పంచ
భూతాలు బలయిపోతున్నాయి.
ఈ కాలుష్య భూతం భూమిపైన
వీరవిహారం చేయటానికి కారణం మానవుడే. నిజంగా
చెప్పాలంటే ప్రకృతిలో మనిషి
చాలా చిన్న అంశం. మరి ఆ
మనిషి సమూలంగా ఈ ప్రకృతి
వినాశనం చేస్తున్నాడు. మరి
మనిషి శరీరానికి ఊపిరితిత్తులు
ఎంత అవసరమో, పర్యావరణానికి
అడవులు అంత అవసరం.
మనిషి తన స్వార్ధ బుద్ధితో
అడవులను నాశనం చేస్తున్నాడు.
విచక్షణారహితంగా చెట్లను
కొట్టేసి వర్షాభావ పరిస్థితులు
వచ్చేటట్లు చేస్తున్నాడు. చెట్లు
పర్యావరణంలో ఉన్న చెడు
గాలిని తీసుకుని మనకు ప్రాణవాయువును
అందిస్తాయి. అడవులలో ఉన్న
చెట్లను కొట్టివేస్తే ఈ వాయు
కాలుష్యం అదుపులోకి రాదు.
మనిషికి ఆహారం, నీరు కంటే
వాయువు మరింత అవసరం.
ప్రాణ వాయువు పీల్చకుండా
ఒక్క క్షణం కూడా ఉండలేడు.
అంత ముఖ్యమైన వాయివును
కలుషితం చేయటం మనిషికి
తగునా. మానవుడు చాలా
తెలివిగలవాడు అంటారు కానీ
ఈ విషయంలో మూర్ఖుడే.
మనిషికి కాలుష్యానికి కారణాలు తెలుసు. ఆ
కాలుష్యాన్ని అదుపుచేయటం
కూడా తెలుసు. అయినా
మూర్ఖంగా ఏది చేయకూడదో
అదే చేస్తున్నాడు. కనీసం
సహజ సిద్ధంగా ఏర్పడిన
అడవులను కొట్టివేయకుండా
ఉంటేనయినా ప్రకృతి ఈ
కాలుష్య భూతం నుండి
తప్పించుకుంటుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని