అడవిలో దెయ్యం (దెయ్యం పార్ట్ 4)
అలా సుబ్బారావు అడవిలో నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఆ ఉత్తరం చదువుతాడు ఆ ఉత్తరంలో ఏముంది అంటే ఒక చిన్న పిల్ల ఒక రోజు ఒంటరిగా అడవిలోకి వెళ్ళింది ఆ చుట్టుపక్కల అంత నిర్మానుష్యంగా ఉండటంతో ఆ పిల్లకి ఎం చేయాలో తెలియక అక్కడ ఉన్న ఒక బంగ్లాలోకి వెళ్తుంది అక్కడ అంతా భయంకరంగా ఉంటుంది అలానే భయపడుతూ ముందుకు వెళ్తుంది ఆ పాప దూరంగా ఒక శవం కనపడుతుంది అప్పుడు ఆ పాప పరుగు తీస్తుంది అప్పుడు బయటకి వెళ్ళలేక అక్కడే ఒక చోట దాక్కుని ఉంటుంది అంతలో ఆ శవం మెల్లగా కదులుతూ వచ్చి ఆ బంగ్లాలో కి ప్రవేశిస్తుంది అక్కడ వస్తువులు అన్ని గాలిలొ ఎగురుతాయి ఆ పాపకి ఇంకా భయం వేస్తుంది ఏడుపు మొదలుపెడుతుంది మెల్లగా శవం లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆ పాప లో ప్రవేశిస్తుంది
ఆ పాప హఠాత్తుగా తన రూపురేఖలు మారుస్తుంది
వింతగా ప్రవర్తిస్తుంది అలా ఎందుకు చేస్తోంది అని తెలుసుకోవాలని ఒక డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తారు తన చుట్టాలు తన చిన్న వయసులో తన తల్లి తండ్రి చనిపోవడం చూసిన పాప అదే ఊహలో ఉండి ఎప్పుడు ఆ బంగ్లా కి వెళ్తుంది అని డాక్టర్ చెప్తాడు
ఇదంతా చదివిన సుబ్బారావు
భయపడి స్వామీజీ నీ వెంటపెట్టుకుని ఆ బంగ్లా కి వెళ్తాడు ఇద్దరు బంగ్లా లోకి వెళ్తారు హఠాత్తుగా స్వామీజీ మాయం అవుతాడు సుబ్బారావు స్వామీజీ ఉన్నాడు అనుకుని వెళ్లిపోతుంటాడు
అసలు ఏమైంది అంటే అసలు ఆ స్వామిజి లేరు కానీ సుబ్బారావు అడవిలో భయం భయంగా ఉండటంతో సుబ్బారావు ఊహించుకుంటాడు
అక్కడనుంచి బయటకి వచ్చిన సుబ్బారావు
ఇంకెప్పుడు అటు వైపు వెళ్ళలేదు
ఇక్కడితో కథ ముగుస్తుంది
– భరద్వాజ్