అడవి దారి
అందమైన ప్రకృతి దృశ్యాలు చూడాలంటే ఒకసారైనా అడవిలో ట్రెక్కింగ్ చేయాలి. అడవిలో అన్నీనిర్మానుష్య దారులే. సామాన్యంగా మరోమనిషి కనపడరు.
మీరు,మీతోపాటు ఆ ప్రకృతిఅంతే. చుట్టూ పచ్చనిచెట్లు, రకరకాల పక్షులకువకువలు. ముళ్ళబాటలోనడవాల్సి వస్తుంది. పెద్ద- పెద్ద పాముల పుట్టలు. చిన్న -చిన్నజలాశయాలు.
అడవి జంతువులు ఉన్నాయనే సైన్ boబోర్డులు. అడవి జంతువులు నిజంగా ఉన్నాయనేందుకుగుర్తుగా వాటి పాద ముద్రలు.అక్కడక్కడా పాములు కనబడుతూ ఉంటాయి.
రోడ్డు పక్కనే కోతుల గుంపులు.అడవిలోకి వెళ్ళినప్పుడుఉండే భయం ఆ తర్వాతఆ ప్రకృతి అందాలను చూస్తూఉంటే ఆ భయం పోయిసంభ్రమాశ్చర్యాలకు లోనవుతాము.
నాకు నర్సాపూర్అ డవి,శ్రీశైలఅడవులు,శేషాచల అడవులను చూసే అదృష్టం కలిగింది. ఎంత అధ్భుతమైనప్రకృతి దృశ్యాలు. చాలా రమణీయమైన ప్రదేశాలు.అదృష్టం ఉంటే అడవి జంతువులను చూసే అదృష్టంకూడా మనకు దొరుకుతుంది.
అడవిలాంటి ఫీలింగ్ కలిగించేనెహ్రూ జూ పార్క్ కూడా మనహైదరాబాద్ నగరంలోనే ఉంది.హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న అటవీప్రాంతం నర్సాపూర్.
ఒకసారైనా తప్పనిసరిగా వెళ్ళండి.నర్సాపూర్ ఊరు కూడాచాలా బాగుంటుంది. ఒంటరిగా అడవిలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి.
అడవి జంతువులు ఉంటాయట. నేను ఇప్పటికి మూడు సార్లు వెళ్ళాను.చాలా అధ్భుతమైన ట్రిప్.
-వెంకట భాను ప్రసాద్