అడవి తల్లి
వరదల ఉధృతి పెరగనెలా
వాన ఉధృతి తరగనెలా
ఒంటరి గూడెం లో ఉండనేలా
కొండల్లో , కోనల్లో తిరుగుతూ
చెట్టు చేమ వెతుకుతూ పుట్ట తేనె
సహజంగా దొరికే పళ్ళు తేoపుకునే
అమ్మితే , సావుకారి ఇచ్చే దుడ్డు తోని సరుకులు తెచ్చి కడుపులు
నింపుకునే అడవి జాతి మనుషులం
ఈ వాన వలన అడవిలో కి పోలేక
ఇంట్లో ఉండలేక ,పిల్లల ఆకలో రామచంద్రా అంటుంటే వినలేక
భార్యా చూసే చిదరింపుల చూపులు
తట్టుకోలేక నన్ను నేను చంపుకుంటూ నాలో నేనే మధన పడుతూ …
అడవి తల్లి ఒక్క పూట అయినా
కరుణించక పోతుందా అని ఆకాశం వైపు చూస్తూ,
మూలకు ముడుచుకు కూర్చున్నా అశక్తుడినై…
-భవ్య
Superb…