ఆశ
నిశీధిని చీల్చుకొంటూ
ఆటంకాలను ఎదుర్కొంటూ
జనం కోరిన వెలుగవ్వర
ఎరుపెక్కిన ఉదయమల్లే
నీ రాక కొరకు ఎదురుచూసే
పూలల్లే ఈ జగమంతా
కిరణాలను ప్రసరించర
ఎరుపెక్కిన ఉదయమల్లే
ముందే పసిగట్టేనుగా
గువ్వలు, కాకులు
ఎరుపెక్కిన ఉదయం కోసమే
తమ తపనంతా అని
నిద్దురపోయిన జీవితాలకు
మరో వెలుగవ్వాలి నీ గమ్యం
ఇంకొంత భలం కూర్చర
ఎరుపెక్కిన ఉధయమల్లే
ఓడిపోయిన బతుకులకు
మరొక్క అవకాశం అంటూ
గెలిచే దారి చూపరా
ఎరుపెక్కిన ఉధయమల్లె
విప్లవ జ్యోతిలా
క్రీడా కాగడలా
దేవుని దీపంలా
ఎరుపెక్కే ఉదయం
– హనుమంత